కేతుగ్రస్త చంద్రగ్రహణంతో ఈ రాశులవారికి దోషం... పరిహారం చేసుకోండి!
2026 మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడే ఈ పాక్షిక కేతుగ్రస్త గ్రస్త చంద్రగ్రహణం ప్రభావం, ఏఏ రాశులవారిపై ఉంటుంది? వారు చెయ్యాల్సిన పరిహారాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
భారత్‌లో చంద్రగ్రహణ విడుపుదశ మాత్రమే
దృక్ పంచాంగ గణితం ప్రకారం మార్చి 3, మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున పూర్వ ఫాల్గుణి అంటే పుబ్బ నక్షత్రంలో, సింహ రాశిలో ఈ చంద్ర గ్రహణం సంభవించనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం కాగా, భారత్‌లో చంద్రోదయం సమయంలో గ్రహణ విడుపు దశ మాత్రమే దర్శనమిస్తుంది. అందువల్ల దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పరిగణిస్తారు. అయితే భారతదేశంలో పాక్షికంగా కనిపించినా శాస్త్రోక్త నియమాలు పాటించాల్సిందేనని పండితులు సూచిస్తున్నారు.

చంద్ర గ్రహణ సమయం ఇలా
ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 3:21 గంటలకు తూర్పు, ఈశాన్య భారతదేశంతో పాటు సింగపూర్, చైనా ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. మధ్య కాలం సాయంత్రం 5:03కి, మోక్ష కాలం 6:48కి ఉంటుంది. మొత్తం వ్యవధి 3 గంటల 27 నిమిషాల పాటు ఇది సంభవిస్తుంది. భారత్‌లో చంద్రోదయం అనంతరం సుమారు 25 నుంచి 40 నిమిషాల పాటు ఈ గ్రహణం దర్శనమివ్వనుంది.
గ్రహణ సమయంలో ఇలా చేస్తే మంచిది
రేపు సంభవించే చంద్ర గ్రహణ ప్రభావం దృష్ట్యా ఆలయాలను తాత్కాలికంగా మూసివేయడం చేస్తారు. అంతేకాదు గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం, గ్రహణం విడిచే ముందు విడుపు స్నానం వంటి ఆచారాలు పాటించాలి. సనాతన ధర్మాన్ని అనుసరించే వారు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం ముగించి, గ్రహణం పూర్తయ్యేవరకు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడేవారు గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించకుండా భగవన్నామ స్మరణలో ఉండాలని సూచిస్తున్నారు.
ఈ రాశులవారికి చంద్ర గ్రహణంతో ప్రతికూల పరిస్థితులు
సింహ రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతున్నందున సింహ రాశి వారు గ్రహణాన్ని చూడకూడదని సూచించారు. సింహ, కుంభ, కర్కాటక, మకర రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉందని, మిగతా రాశులకు మధ్యస్థ లేదా అనుకూల ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే వారు మరుసటి రోజు గ్రహశాంతులు, జపాలు చేయడం ద్వారా దోష నివారణ పొందవచ్చు.
ఇలా చేస్తే చెడు ప్రభావాల నుండి విముక్తి
ఎవరైనా సరే చంద్ర గ్రహణానికి ముందు తలస్నానం చేయాలి. గ్రహణం అనంతరం సబ్బులు, షాంపూలు వాడకుండా విడుపు స్నానం చేయాలని సూచించారు. ఈ సమయం పుణ్యకాలంగా భావించబడుతుంది. దానాలు, జపాలు, ధ్యానం చేయడం ద్వారా విశేష పుణ్యం లభిస్తుంది. దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన చేయడం శ్రేయస్కరం. ఉపనయనం చేసిన వారు గాయత్రీ మంత్రాన్ని జపించాలి.
గ్రహణం అనంతరం ఈ దానాలు చేస్తే ఈ రాశులవారికి పరిహారం
ఎవరైతే గ్రహ దోషాలతో బాధ పడతారో వారు గ్రహణం అనంతరం వెండి, బియ్యం, గోదానం వంటి దానాలు విశేష ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఇల్లు, పూజా మందిరం, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై దర్భలు ఉంచాలి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications