అరుదైన పుత్రద ఏకాదశి- ఇవి ఆచరించి చూడండి

శ్రావణ మాసంలో శివుడు, శ్రీమహావిష్ణువు పూజలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి వ్రతం సంతానం, శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. శ్రావణ శుక్ల పక్ష ఏకాదశిని పుత్రద ఏకాదశిగా జరుపుకొంటారు. ఈ సారి ఆగస్టు 4 లేదా 5వ తేదీలలో ఏది సరైనదనే విషయంలో భక్తులలో అయోమయం నెలకొంది.

హిందూ పంచాంగం ప్రకారం, శ్రావణ శుక్ల పక్ష ఏకాదశి తిథి 4వ తేదీన ఉదయం 11:41 గంటలకు ప్రారంభమౌతుంది. 5వ తేదీన మధ్యాహ్నం 1:12 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని అనుసరించి పుత్రద ఏకాదశి వ్రతాన్ని 5వ తేదీన అంటే మంగళవారం రోజున ఆచరించాలి. ఈ శుభ దినాన శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

ఈ వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన ముహూర్త వివరాలు ఇలా ఉన్నాయి..

బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:20 నుండి 5:02 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 నుండి 12:54 వరకు, రవి యోగం తెల్లవారు జామున 05:45 నుండి 11:23 వరకు ఉంటాయి. సాయంత్రం పూజా సమయం 7:9 నుండి 7:30 వరకు శుభప్రదంగా పరిగణిస్తారు.

వ్రత పారణం అంటే ఉపవాసం విరమించే సమయం 6వ తేదీన తెల్లవారు జామున 5:45 నుండి ఉదయం 8:26 వరకు ఉంటుంది. పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

శ్రద్ధగా, నియమనిష్టలతో వ్రతం చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి ప్రసన్నమై సంతాన సౌఖ్యాన్ని అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం సంతానం కోసమే కాకుండా, కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు, ఐక్యతను పెంపొందించడానికి కూడా ఆచరిస్తారు. శ్రావణ మాసం పవిత్రత కారణంగా, శివుడు, విష్ణువులను కలిపి పూజించడం వల్ల ఈ వ్రతానికి మరింత మహత్యం చేకూరుతుంది.

పుత్రద ఏకాదశి పూజా విధానం..

తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి, పసుపు లేదా ఎరుపు రంగు శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ముందుగా సూర్యదేవునికి జలాన్ని సమర్పించాలి. పూజ కోసం పసుపు వస్త్రం పరిచిన పీటపై శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టించాలి.

విష్ణువు, లడ్డూ గోపాలునికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన పంచామృతంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పసుపు పుష్పాలు, తులసి దళాలు, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని జపించి, విష్ణు సహస్రనామాన్ని పఠించడం శ్రేయస్కరం.

పూజ అనంతరం రోజంతా నిరాహారంగా లేదా ఫలాహారంగా ఉపవాసం ఉండాలి. రాత్రిపూట శ్రీమహావిష్ణువు భజన కీర్తనలలో పాల్గొనడం మంచిది. అలాగే, అవసరమైన వారికి ఆహారం, వస్త్రాలు లేదా ఇతర సామాగ్రిని దానం చేయాలి. పిండితో చేసిన దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించి, రావి లేదా మర్రి ఆకులపై ఉంచి నదిలో వదలడం సంప్రదాయం.

Disclaimer: పుత్రద ఏకాదశి వ్రత ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఉద్దేశించిన కథనం ఇది. వ్రతాన్ని ఆచరించదలిచిన వారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి పండితులు, అర్చకులను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+