నేటినుంచి అక్టోబరు వరకు ఈ రాశులవారు మహారాజులే
శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటుంది. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11.58 గంటలకు రాహువు మేషరాశిలోకి ప్రవేశించాడు. అక్టోబరు 30వ తేదీ వరకు అక్కడే సంచరిస్తాడు. అనంతరం బృహస్పతి యాజమాని అయినటువంటి మీనరాశికి వెళతాడు. రాహువు అంటేనే దుష్టగ్రహమని చాలామంది భావిస్తారు. కానీ అప్పుడప్పుడు మంచి ఫలితాలను కూడా రాహువు అందిస్తాడు. మేషరాశిలో సంచరించడంవల్ల ఏయే రాశులకువారికి మంచి జరగనుందో తెలుసుకుందాం.
కుంభ రాశి : రాహువు మూడో ఇంట్లో సంచరిస్తున్నాడు. దీనివల్ల వ్యాపారస్తులకు వారి వ్యాపార విస్తరణ జరుగుతుంది. మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని లేదంటే స్థలాన్ని మార్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రాశిలోని 6వ ఇంట్లో రాహువు ఉన్నాడు. దీని ప్రభావం వల్ల ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి పదోన్నతితోపాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. గతంలో ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
సింహ రాశి : ఈ రాశి 10వ ఇంట్లో రాహువున్నాడు. దీనివల్ల వీరు అనుకున్న పనిని సులభంగా సాధిస్తారు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. వారితో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేయడంవల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. రాహువు చెడ్ ప్రభావం నివారించడానికి శివలింగానికి జలాభిషేకం చేయాలి.
కర్కాటకం : ఈ రాశి కర్మ గృహంలో రాహువు సంచరించబోతున్నాడు. ఆర్థికంగా లాభపడటమే కాకుండా వ్యాపారస్తులకు వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. అనారోగ్యం తగ్గిపోతుంది. ఐటీ రంగానికి సంబంధించినవారు ప్రయోజనం పొందుతారు. కుక్కకు పాలు, రొట్టెలు ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications