రేపే రాజ పంచక కాలం ప్రారంభం

ఏప్రిల్ 13 నుండి 17 వరకు చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచరించడం వల్ల పంచక కాలం ఏర్పడుతుంది. ఏప్రిల్ 13న సోమవారం మొదలవుతున్నందున ఈ కాలాన్ని రాజ పంచక్ అని వ్యవహరిస్తారు. ఇది చాలా శుభప్రదమైన కాలంగా పరిగణిస్తారు. హిందూ పంచాంగంలో పంచక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ పంచక్ సమయంలో ఏయే పనులు చేయాలి, ఏవి చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కుంభ, మీన రాశుల్లోకి చంద్రుడు ప్రవేశించడంతో ఈ కాలం మొదలవుతుంది. సాధారణంగా పంచక్‌ను అశుభకరంగా భావించినప్పటికీ, అన్ని పంచక్‌లు ఒకేలా ఉండవు. పైగా రాజ పంచక్ సోమవారంతో ప్రారంభమవుతుంది. ఇది సుఖం, సంపద, పేరు ప్రఖ్యాతులు పెంచుతుందని నమ్ముతారు.

Raj Panchak Plan Your Practices Do s Don ts and Devotional Paths During Unique Lunar Phase

శాస్త్రాలలో పంచకాలు మొత్తం అయిదు రకాలు. రోగ పంచక్, అగ్ని పంచక్, మృత్యు పంచక్, చోర పంచక్, రాజ పంచక్. వీటిలో రాజ పంచక్ మాత్రమే శుభప్రదం. 'రాజ' అనే పదం గౌరవం, శ్రేయస్సు, సంపదలకు ప్రతీక. ఈ కాలంలో భక్తి, దానధర్మాలు, కొత్త పనులు ప్రారంభించడం, విజయానికి దారితీస్తుంది. రాజ పంచక్ ఓ అరుదైన, విశేష శుభ సమయం. ఈ ప్రత్యేక కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని పొందవచ్చు.

పంచాంగ గణన ప్రకారం, రాజ పంచక్ ఈ నెల 13 సోమవారం ఉదయం నుండి 17వ తేదీ శుక్రవారం సాయంత్రం వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచరిస్తాడు. రాజ పంచక్ శుభప్రదమైనప్పటికీ, కొన్ని పనులు చేపట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని విస్మరిస్తే అశుభ ఫలితాలు కలగవచ్చని హెచ్చరిస్తున్నాయి.

పంచక కాలంలో కలప, ఇంధనం లేదా ఇతర మండే వస్తువులను నిల్వ చేయకూడదు. ఇది అగ్ని ప్రమాదాలకు, ఊహించని ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. అలాగే, మంచాలు లేదా పరుపులు వంటి శయ్యలను తయారు చేయడం కుటుంబ సభ్యులకు ఆపదలు తెస్తుందని నమ్మకం. రాజ పంచక్ లోనూ ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. రాజ పంచక్ కాలంలో కూడా పెద్ద నిర్మాణ పనులను వాయిదా వేసుకోవాలి. చిన్న చిన్న మరమ్మతులేవైనా ఉంటే చేసుకోవచ్చు.

దక్షిణ దిశగా ప్రయాణం మానుకోవాలి. జ్యోతిష్యుల ప్రకారం. దక్షిణ దిక్కు యమధర్మరాజుకు చెందుతుంది. అందుకే ఈ దిశలో చేసే ప్రయాణంలో ఆటంకాలు, ఆలస్యాలు లేదా ప్రమాదాలు సంభవించవచ్చు. అత్యవసరమైతే హనుమాన్ పూజ చేసి రుద్రాక్ష ధరించాలని సూచిస్తున్నారు. ఇంటి కప్పు వేయడం లేదా ఏదైనా కొత్త నిర్మాణం ప్రారంభించడం అశుభ ఫలితాలనిస్తుంది. ఇది ధన నష్టం, కుటుంబ కలహాలు లేదా నిర్మాణ పనులలో అడ్డంకులకు కారణం కావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+