మూడు గ్రహాల అరుదైన కలయిక..ఈ రాశుల వారికి పంట పండినట్టే..!
జోతిష్యశాస్త్రంలో గ్రహాలు తరచుగా మారుతుంటాయి.ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్లడం సాధారణంగా జరిగే ప్రక్రియే.ఒక్కోసారి రెండు, మూడు గ్రహాలు.. ఒకే రాశిలోకి ప్రవేశించే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి సమయంలో.. ఆ ప్రభావం కొన్ని రాశులపై చాలా ఎక్కువగా ఉంటుంది.ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం ద్వారా కొన్ని రాశుల వారికి లాభాలు చేకూర్చగా, మరి కొన్ని రాశులకు నష్టాలు కలిగించవచ్చు. అయితే సూర్య, బుధ, శని గ్రహాల అరుదైన కలయిక ఐదు రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీంతో వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో పరిశీలిద్దాం.
మీన రాశి
సూర్య, బుధ, శని గ్రహాల మీన రాశి వారికి పుష్కలంగా లభించనున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది.వ్యాపారం చేసే వారికి లాభాలు చేకూరే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆ రాశి వారికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది.

వృషభ రాశి
గ్రహాల అరుదైన కలయిక వృషభ రాశి వారి అదృష్టం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృద్ధి కనిపిస్తోంది.కుటుంబ విషయాల్లో కూడా ప్రయోజనకరం కనిపిస్తోంది.ఇల్లు, ఆస్తికి సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి త్రిగ్రహి యోగం చాలా శుభకరంగా ఉంటుంది.సూర్య, బుధ, శని గ్రహాల అనుగ్రహంతో అన్ని పనులు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పుల బాధలు తీరతాయి.చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపిస్తోంది.
సింహ రాశి
సింహ రాశి వారికి కూడా సూర్య, బుధ, శని గ్రహాల అరుదైన కలయిక కలిసి వస్తోంది. విద్యారంగంలో అనుకున్నవిజయాలను సాధిస్తారు.వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
త్రిగ్రహి యోగం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటోంది. ఈ రాశి వారికి అనుకున్న ఉద్యోగం దొరుకుతుంది. జీవితంలో వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. త్రిగ్రహి యో వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications