అక్షయ తృతీయకు ముందు ఇంట్లో నుండి ఈ వస్తువులు బయట పారెయ్యండి...లేదంటే దరిద్రం!!
అక్షయ తృతీయ... భారతదేశంలో ఇదో విశిష్టమైన పండుగ. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని పరిణయమాడిన రోజుగా అక్షయ తృతీయ ను చెబుతారు. అంతేకాదు పరమశివుడు కుబేరుడిని సంపదలకు రక్షకుడిగా నియమించిన రోజుగా అక్షయ తృతీయ కు విశేషమైన స్థానం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖమాసంలోని శుక్లపక్షం తదియ తిథినాడు అక్షయ తృతీయ ను జరుపుకుంటారు.
ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 22వ తేదీన ఉదయం ఏడు గంటల 49నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీన ఉదయం ఏడు గంటల 45 నిమిషాలకు వరకు ముగుస్తుంది. అయితే ఏప్రిల్ 22వ తేదీనే పూర్తిగా తదియ తిధి ఉంది కాబట్టి. ఆరోజు అక్షయ తృతీయను జరుపుకోవాలని చెబుతున్నారు. అక్షయ తృతీయనాడు చాలామంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు. శ్రీమహావిష్ణువును అత్యంత నిష్ఠతో పూజిస్తారు.

అయితే అక్షయ తృతీయ నాడు ఇవన్నీ చేసేవారు ముందుగా అక్షయ తృతీయకు ముందే ఇంట్లో నుంచి కొన్ని దరిద్రాన్ని తీసుకువచ్చే వస్తువులను లేకుండా చూసుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకున్నా, లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మి నివాసం ఉండదు. కాబట్టి అక్షయ తృతీయ ముందే ఇంటిని శుద్ధి చేసుకోవాలి.
ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన చీపుర్లను ఉంచుకోకూడదు. ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. కాబట్టి పాడైపోయిన విరిగిపోయిన చీపుర్లను బయటపడేయాలి. తెగిపోయిన చెప్పులను, పాడైపోయిన చెప్పులను కూడా బయట పారేయాలి. అంతేకాదు విరిగిపోయిన ఫోటో ఫ్రేములు, విరిగిపోయిన పాత్రలు, పాడైపోయిన గిన్నెలు ఇలా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. ఆ ఇళ్ళల్లో లక్ష్మీదేవి నివసించదు.
ఇక ఇంట్లో ఎక్కడ చూసినా బూజు, చెత్త చెదారం ఉంటే అటువంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు. కాబట్టి అక్షయ తృతీయకు ముందే ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ఎండిపోయిన మొక్కలను పీకి పారేయాలి. పాడైపోయిన వస్తువులను ఇంటికి దూరంగా పడేయాలి. ఇల్లంతా సానుకూలత నిండేలా సర్దుకోవాలి. అప్పుడే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి పూజలు చేసిన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications