దీపావళి వేళ సమసప్తక రాజయోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈ నెల 11వ తేదీన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల సమసప్తక రాజయోగం ఏర్పడింది. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని రాశిచక్ర గుర్తులకు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారంతా ప్రశాంతంగా ఉంటారు. ప్రధానంగా నాలుగు రాశులవారు విశేషమైన ప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఇప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి. చాలా అద్భుతంగా రోజులు గడుస్తాయి. శనిదేవుడి ఆశీస్సులు లభించడంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. మానసికంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తిచేస్తారు. ఈ రాశివారు కూడా శనిదేవుడి ఆశీర్వాదం కోసం తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి.

కుంభరాశి
వీరికి అదనంగా ఆదాయమార్గాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభించడంతోపాటు పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. జీవితాన్ని చాలా సమతుల్యంగా గడుపుతారు. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి స్థాయి కలుగుతుంది.
మకర రాశి
ఈ రాశివారు కొత్తగా ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు లభిస్తుంది. కార్యాలయాల్లో ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
గతంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. కెరీర్ పరంగా ఈ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. గతంలో పెట్టినవాటి నుంచి కూడా ఈ సమయంలోనే అందుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు వాటిని పూజించడంవల్ల మంచి కలుగుతుంది.












Click it and Unblock the Notifications