మార్చి 29 నుంచి ఈ రాశులకు అదృష్టం దరిద్రంలా పట్టుకుంటోంది
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉన్నవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. మార్చి 29వ తేదీ నుంచి ఆయన మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మాత్రమే శనిదేవుడు రాశిని మారుస్తాడు. దీనివల్ల అనుకున్న పనుల్లో విజయాలను అందుకోవడంతోపాటు ఆర్థిక లాభాలను కూడా పొందనున్నారు. ఏయే రాశులకు అద్భుత లాభాలున్నాయి, ఏయే ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకుందాం.
మీన రాశి
డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తులకు పనులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అలాగే ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు. దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. అలాగే ఆనందం కూడా వీరు ఊహించనిరీతిలో పొందుతారు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది.

వృషభరాశి
వీరి తలరాత పూర్తిగా మారిపోనుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్యంతో పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులుండవు. రుణాల నుంచి బయటపడతారు.కెరీర్ పరంగా కొన్నాళ్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుకుంటారు. మంచిగా ఎదుగుతారు. ఆర్థికంగా అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
మిథున రాశి
గతంలో బలహీనంగా ఉన్న వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనేక అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారస్తులు కూడా అద్భుతంగా రాణిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శనిదేవుడికి పూజ చేయడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నవగ్రహ స్తోత్రం పఠించాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంతవరకు ఈ రాశివారు చాలా తక్కువగా, ఆచితూచి మాట్లాడాలి. లేదంటే వివాదాలు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications