సెప్టెంబర్ 21 పితృపక్షాల చివరిరోజు,సూర్యగ్రహణం.. వీరికి అదృష్టం బంకలా పట్టుకుంటుంది!

హిందూ మత విశ్వాసాల ప్రకారం పితృ పక్షాలకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం రోజున పితృ పక్షాలు ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ 21 సర్వ పితృ అమావాస్యతో ముగియనున్నాయి. ఇక ఇదే రోజున రెండవ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది.

సెప్టెంబర్ 21 చాలా పవర్ ఫుల్
సర్వ పితృ అమావాస్య, ఆదివారం, అందునా పితృ పక్షాల చివరి రోజు, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతున్న కారణంగా సెప్టెంబరు 21 చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 11 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారి జామున 3.24 నిమిషాల వరకు ఉంటుంది.

September 21st is the last day of the Pitru Paksha a solar eclipse These zodiacs will be lucky

సూర్య గ్రహణం ప్రభావంతో అదృష్ట రాశులు
సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినప్పటికీ సూర్య గ్రహణ ప్రభావం మన జీవితంపైన ఉంటుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా పితృ పక్షంలో ఏర్పడే సూర్య గ్రహణానికి మరింత ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
పితృ పక్షాల చివరి రోజు, రెండవ సూర్యగ్రహణం ఏర్పడే రోజు వృషభ రాశి జాతకులకు మేలు జరుగుతుంది. ఈ సూర్యగ్రహణం వృషభ రాశిలో లాభ స్థానంలో ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి కలిసి వస్తుంది. సూర్య గ్రహణం తర్వాత మీరు పేదలకు గోధుమలు దానం చేస్తే మంచిది.

మిధున రాశి
సర్వ పితృ అమావాస్య వల్ల ఏర్పడే సూర్యగ్రహణం మిధున రాశి జాతకులకు శుభాలను ఇస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. పాత పరిచయస్తుల ద్వారా ప్రయోజనాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది. సూర్య గ్రహణం తర్వాత వీరు పేదలకు రాగి వస్తువులు దానం చేస్తే మంచిది.

మకర రాశి
మకర రాశిలో సూర్యగ్రహణం మూడవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ లోను, వ్యాపారాల్లోను సానుకూల ఫలితాలు వస్తాయి. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి గౌరవం దక్కుతుంది. సోదరులతో సంబంధాలు బలపడతాయి. మకర రాశి జాతకులు సూర్య గ్రహణం తర్వాత నల్ల నువ్వులు, మినపప్పు దానం చేయడం వల్ల వీరికి శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది.

కుంభరాశి
కుంభరాశి నుంచి సూర్యగ్రహణం రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల కుంభ రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా లబ్ది జరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆస్తులలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం. కుంభ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సూర్య గ్రహణం తర్వాత వీరు బార్లీ లేదా సత్తు ను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+