కుంభరాశిలో మహా సంయోగం.. ఈ రాశులకు ఐశ్వర్యం
ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని ఒక రాశి నుంచి మరో రాశికి మారుస్తుంది. ఈనెలలో మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవబోయే అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తుండటగా శుక్రుడు కూడా అక్కడికే ప్రవేశించాడు. కుంభరాశిలోకి కుజుడు కూడా ప్రవేశించనున్నాడు. ఆ రాశిలో శుక్రుడు, కుజుడు, శని కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల మూడు రాశులవారికి అద్భుతంగా కలిసిరాబోతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మకరరాశి
త్రిగ్రాహి యోగం ఈ రాశివారికి మంచి లాభాలను కలిగించనుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆగిపోయిన పనులు సత్వరమే పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో లేదంటే సన్నిహితులతో కలిసి ఆధ్యాత్మికపరమైన యాత్రలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు.

మేషరాశి
మేషరాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కెరీర్ లో మంచి స్థానానికి చేరుకుంటారు. పూర్వీకుల నుంచి స్థిరచరాస్తులు వారసత్వంగా సంక్రమిస్తాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. అదృష్టం తోడుండటంవల్ల పెట్టే పెట్టుబడులన్నీ లాభాలను కలిగిస్తాయి.
వృషభరాశి
ఈ రాశివారిని అదృష్టం వరిస్తుంది. చేపట్టే ప్రతి ప్రాజెక్టును విజయవంతం చేస్తారు. ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. సంతానప్రాప్తి కలుగుతుంది.












Click it and Unblock the Notifications