గ్రహాల మార్పుతో ఈ రాశులు అపర కుబేరులు కాబోతున్నారు
ఏడాది పాటు ఎంతో కష్టపడ్డాం.. ఈ సంవత్సరమన్నా కలిసిరాదా? అనే ఆశతో ఎంతోమంది ఉంటారు. కొత్త సంవత్సరంలో అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చే శనిదేవుడు, ప్రతి 18 నెలలకు ఒకసారి తమ రాశిని మార్చే రాహువు, కేతువు కూడా ఈ ఏడాదిలో రాశులను మారుస్తున్నాయి. ఈ మార్పు వల్ల ప్రధానంగా కొన్ని రాశులవారు అపర కోటీశ్వరులవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి అంత బాగా ఈ సంవత్సరం కలిసివస్తోంది. ఆ రాశుల వివరాలను పరిశీలిద్దాం.
తుల
వీరికి ఆర్థిక సమస్యలు ఉండవు. శనిదేవుడి వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. రాహువు వల్ల అప్పుల బాధలు తగ్గుతాయి. బృహస్పతి వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.

ధనుస్సు
రావల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి. అలవెన్స్ లు కూడా వస్తాయి. ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి, అప్పుల బాధ నుంచి బయటపడతారు. మే నెలాఖరు నుంచి వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. బృహస్పతి ఏడో రాశిలోకి ప్రవేశిస్తుండటమే దీనికి కారణం.
మకర రాశి
శనిదేవుడు ధనస్థానంలో ఉండటంతో అప్పుల బాధ నుంచి, ఇతర ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం రాహువు, బృహస్పతి, శుక్రుడు, శనిదేవుడు అనుకూలంగా ఉండటంతో బాగా కలిసివస్తుంది.
వృషభం
ఈ ఏడాది వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. అయితే ఇల్లు, వాహన రుణాలు మాత్రం అలానే ఉంటాయి. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటంతో వీరు కోటీశ్వరులవుతారు. శనిదేవుడు అనుకూలంగా ఉన్నాడు. డబ్బులు వచ్చే స్థానంలో బృహస్పతి ఉన్నాడు.
కర్కాటకం
మే నెలాఖరులోగా ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఫిబ్రవరి నుంచి నెమ్మదిగా సమస్యలన్నీ తొలగిపోవడం ప్రారంభిస్తాయి. ఆదాయం పెరగడానికి మార్గాలు దొరుకుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
కన్య
అప్పుల బాధ తగ్గుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, వృత్తిలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. శుక్రుడి సంచారంవల్ల ఆకస్మికంగా ధనలాభం ఉంది. శనిదేవుడు అప్పుల బాధను తగ్గిస్తాడు.












Click it and Unblock the Notifications