మిథునరాశిలో బృహస్పతి... 2025లో ఈ రాశుల పంట పండింది.. తిరుగులేదు

నవగ్రహాల్లో కీలకమైన బృహస్పతి దేవతలకు గురువు. వచ్చే ఏడాది మే 14న తన రాశిని మార్చోబోతున్నాడు. మిథునరాశిలోకి ప్రవేశించి అక్టోబరు 18వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అనంతరం అక్కడి నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. తిరిగి డిసెంబరు ఐదోతేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇలా మూడు సార్లు కొత్త సంవత్సరంలో సంచారం చేయడంవల్ల కొన్ని రాశులవారి ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. మంచి ఆరోగ్యాన్ని పొందనున్నారు. గురుడి సంచారం ఏయే రాశులకు, ఏవిధంగా లాభసాటిగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
వీరికి అదృష్టం బాగా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే యోచన చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలాంటివి చేస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రయాణాలుంటాయి. ఇవి కూడా లాభసాటిగా మారతాయి. కొత్త పనిని ప్రారంభించే సమయంలో బృహస్పతిని పూజిస్తే శుభం కలుగుతుంది.

six zodiac signs will get amazing benefits in 2025 due to jupiter enter in gemini

వృషభ రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా వస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. కొత్తగా వాహనాన్ని, స్థలాన్ని కొనుగోలు చేస్తారు.

మిథున రాశి
పనిచేస్తున్న ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టును కనిపెట్టే అవకాశం ఉంది. గతంకంటే ఆరోగ్యం బాగుంటుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయాన్ని అందుకుంటారు. శుభవార్తలు చెవిన పడతాయి.

సింహ రాశి
మంచి లక్షణాలు అలవడతాయి. పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని పనుల్లో శుభ ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి
అదృష్టం తోడుంటుంది. అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

కుంభ రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యాపారాల్లో విజయాలు అందుకుంటారు. మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+