మే 31 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శనిదేవుడు ఈనెల 31 నుంచి మీనరాశిలో ఒంటరిగా సంచారం చేయబోతున్నాడు. 2026 ఫిబ్రవరి వరకు అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల అర్థాష్టమ శని, ఏలినాటి శని లాంటి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అనేక శుభ ఫలితాలను శనిదేవుడు ప్రసాదించనున్నాడు. అన్నిరంగాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏయే రాశులకు శనిదేవుడు మంచి ఫలితాలను ప్రసాదించబోతున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చికం
ప్రణాళిక రచించుకొని ఆ ప్రకారం పనిచేస్తే రుణ సమస్యల నుంచి బయటపడతారు. సంతానం కలుగుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు.

మకరం
నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కుంభం
ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యం ఉంది. సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో నెలకున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
వృషభం
వృత్తి, వ్యాపారం బాగుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఊహించనిరీతిలో అదృష్టం పట్టుకుంటుంది. ఆదాయం భారీగా పెరుగుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. విదేశాలకు వెళ్తారు. దుస్తులను, ఆభరణాలను ఎక్కువగా కొంటారు.
కర్కాటకం
ఒత్తిడి నుంచి బయటపడతారు. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. విదేశీ అవకాశాలు నిరుద్యోగులకు, ఉద్యోగం చేస్తున్నవారికి కూడా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
తుల
సామర్థ్యానికి, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.












Click it and Unblock the Notifications