solar eclipse2022: తెలుగురాష్ట్రాలపై సూర్యగ్రహణ ప్రభావం ఉందా? ఏపీ, తెలంగాణాలో గ్రహణ సమయమిదే!!

ఈసారి దీపావళి అమావాస్యకు సూర్యగ్రహణం రావడంతో దీపావళి పండుగపై అపోహలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబరు 25వ తేదీన దీపావళి అమావాస్య ఘడియలు ఉన్నప్పటికీ సూర్యగ్రహణం రావడం కారణంగా అక్టోబర్ 24న దీపావళి పండుగను జరుపుకుంటున్నాం. అయితే ఈసారి దీపావళి తర్వాత రోజు, అమావాస్య నాడు మధ్యాహ్నం 2.32 నిమిషాల నుండి సాయంత్రం 6.32 నిమిషాల వరకు సూర్యగ్రహణం పడుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు సూర్య గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నారు.

తెలుగురాష్ట్రాలపై సూర్య గ్రహణ ప్రభావంపై ఆసక్తి

తెలుగురాష్ట్రాలపై సూర్య గ్రహణ ప్రభావంపై ఆసక్తి

ఇక ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని వారికి సూర్యగ్రహణ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతుంది. సూర్యగ్రహణం తెలుగు రాష్ట్రాలలో ఎంతసేపు మనం చూడవచ్చు అన్న ఆసక్తి కనబడుతుంది. ఇక సూర్య గ్రహణం ఏ ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది అన్న దాని పైన కూడా చర్చ జరుగుతుంది. సాధారణంగా సూర్యుడు చంద్రుడు భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగంలో సూర్యుడు సంపూర్ణంగా కనిపించకుండా పోతాడు మరి కొంత భాగంలో పాక్షికంగా కనిపించకుండా పోతాడు. దీనిని సూర్య గ్రహణం అని అంటారు.

హైదరాబాద్ లో, విశాఖలో సూర్యగ్రహణం కనిపించేది ఇప్పుడే

హైదరాబాద్ లో, విశాఖలో సూర్యగ్రహణం కనిపించేది ఇప్పుడే

ఈ సంవత్సరం సూర్య గ్రహణం అక్టోబర్ 25వ తేదీన వస్తోంది .అయితే ఈసారి తెలుగు రాష్ట్రాలలో కనిపించే సూర్య గ్రహణం పాక్షిక సూర్యగ్రహణమేనని చెబుతున్నారు. భారతదేశంలో ఈ సూర్య గ్రహణం సూర్యాస్తమయ సమయం నుండి ప్రారంభమవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలోని హైదరాబాదులో సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి గ్రహణాన్ని చూడవచ్చు. ఇక విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల1 నిమిషాల సమయంలో గ్రహణాన్ని చూడవచ్చు.

తెలుగురాష్ట్రాల్లో 49 నిముషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం

తెలుగురాష్ట్రాల్లో 49 నిముషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం

తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సూర్య గ్రహణం పాక్షికంగానే కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు. సుమారు 49 నిమిషాల పాటు గ్రహణం ఉంటుందని చెప్తున్నారు. ఈసారి ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం ఐరోపా, యూరప్, మధ్య ఆసియా ,పశ్చిమ సైబీరియా, పశ్చిమ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క ఈశాన్య ప్రాంతాల నుండి కనిపిస్తుందని చెబుతున్నారు. భారత దేశంలో ఈ సూర్యగ్రహణం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమవుతుందని, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారత దేశం లోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాలలోనూ పాక్షిక సూర్యగ్రహణం చూడవచ్చని చెబుతున్నారు.

భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ఎక్కువసేపు కనిపించనున్న సూర్యగ్రహణం

భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ఎక్కువసేపు కనిపించనున్న సూర్యగ్రహణం

భారత దేశంలోని వాయువ్య ప్రాంతంలో సూర్యగ్రహణాన్ని ఎక్కువసేపు చూడవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ సూర్యగ్రహణ కాలంలో మూసివేస్తారు. గ్రహణం విడిచిన తరువాత ఆలయాల నీటిని సంప్రోక్షణ చేసి, తిరిగి పూజాదికాలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఇక గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి అనేక విశ్వాసాలు ఉన్నాయి. వాటిని అనుసరించి సూర్య గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+