solar eclipse 2023: గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేయటం వెనుక కారణాలివే!!
ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. గ్రహణాలు ఏవైనా మానవ జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ సంవత్సరం మొదటి అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన సంభవించనుంది. అయితే సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా అశుభ సూచకంగా భావిస్తారు. ఇది నెగిటివ్ ఎనర్జీకి కారణం అవుతుంది. అందుకే గ్రహణ సమయాన్ని చెడుకాలంగా అభిప్రాయపడతారు.
గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా, మారుమూల గ్రామాల్లో సైతం దేవాలయాలను మూసివేసి గ్రహణనియమాలను పాటిస్తారు. అసలు గ్రహణ సమయంలో దేవాలయాలను మూసి వేయాల్సిన అవసరం ఏమిటి? ఆలయాలలో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు తన శక్తితో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి తమ వద్దకు వచ్చే భక్తులకు శుభాలు చేకూరుస్తాయి. అయితే గ్రహణ సమయంలో దేవతామూర్తుల శక్తి నశిస్తుందని భావిస్తారు. బాగా శక్తివంతులుగా ఉన్న దేవతలు రాహుకేతువులు, సూర్యుడిని మింగేయటం వల్ల శక్తి హీనులవుతారు.

సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులను విడుదల చేస్తాయి. ఈ సమయంలో దేవతామూర్తుల శక్తి నశించడం వల్ల, ప్రతికూల శక్తుల ప్రభావం ఆలయాలలోకి చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆలయాలలోకి ప్రతికూల శక్తులు చేరితే వాటి ప్రభావం మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఈ ప్రతికూల శక్తులను నివారించడం కోసం గ్రహణ సమయం లో దేవాలయాలను మూసివేస్తారు.
ప్రతికూల శక్తికి వ్యతిరేకంగా విగ్రహాలపై తులసి ఆకులను కూడా ఉంచుతారు. ఆలయాల తలుపులను మూసి వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఆలయాలలోని ప్రవేశించదు. గ్రహణం పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆలయాలను పూర్తిగా సంప్రోక్షణ చేసి ఆపై పూజాదికాలు నిర్వహిస్తారు. కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడంలో కోసం గ్రహణ సమయంలో గుడి తలుపులను పూర్తిగా మూసివేసి గ్రహణ నియమాలను పాటిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications