ఆగస్ట్ లో వీరే మహర్జాతకులు అని ప్రకటించిన సూర్య కేతువులు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ గమనం కొనసాగిస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు శుభ యోగాలు, కొన్నిసార్లు అశుభ యోగాలు ఏర్పడతాయి. గ్రహాల కదలికలు, ఇతర గ్రహాలతో వాటి కలయికలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఇక రానున్న ఆగస్ట్ నెలలో జరిగే గ్రహాల సంయోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.
సూర్య కేతువుల కలయిక
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు. ఆగస్టు నెలలో సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించిన సమయంలో కుజుడితో కలుస్తాడు. కేతువు 18 నెలలకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. ఆగస్టు 17న సూర్యుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించడంతో సూర్య-కేతువుల కలయిక ఏర్పడుతుంది.

సూర్య కేతువుల సంయోగంతో అదృష్ట రాశులు
ఈ సూర్య-కేతువుల కలయిక అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే, కొన్ని రాశుల వారికి మాత్రం ఇది విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ కలయిక వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోయి, చాలా సంతోషకరమైన జీవితం లభిస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి సూర్య-కేతువుల కలయిక అదృష్టాన్ని తెస్తుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో అనేక మంచి ఫలితాలను పొందుతారు, ఈ రాశి వారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, పూర్వీకుల ఆస్తి కూడా లభించే సూచనలు ఉన్నాయి. కెరీర్ పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి మంచి సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్య-కేతువుల కలయిక అనుకూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే, ఆస్తులు చేకూరే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్య-కేతువుల కలయిక సంతోషాన్నిస్తుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. దేశ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలు ఎవరి జాతక చక్రం ఆధారంగా వారికి భిన్నంగా ఉండవచ్చు. అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఉండకపోవచ్చు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications