గురు మహాదశతో ఈ రాశులకు స్వర్ణయుగం ప్రారంభం

దేవతల గురువై బృహస్పతి ఆధ్యాత్మికతకు, సంతానానికి, పిల్లలకు కారకుడు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఏడాది చివరలో మిథునరాశిలోకి ప్రవేశించే గురుడు 2026 జూన్ లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది చంద్రుడి రాశి. దీనివల్ల ఏర్పడే గురు మహాదశ కారణంగా రానున్న సంవత్సరంలో 5 రాశులవారి జీవితాల్లో దీపావళి వెలుగులు విరజిమ్మనున్నాయి. 2026లో రెండుసార్లు సంచారాన్ని మార్చుకుంటున్న గురువు వల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

మిథున రాశి
ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు అందుకుంటారు. విదేశాల్లో పనిచేయాలనుకుంటున్నవారికి ఇది స్వర్ణయుగం. అదృష్టం కలిసివచ్చు జీవితం పూర్తిగా మారిపోతుంది.

The Golden Age begins for these zodiac signs with the Mahadasa of Jupiter transit gemini

వృశ్చిక రాశి
కుటుంబంలో శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అపారమైన సంపదను చేతుల్లోకి తీసుకుంటారు. రుణాల నుంచి బయటపడతారు. ఉద్యోగస్థులకు కెరీర్ పరంగా పదోన్నతి ఉంది. ఒకరకంగా ఈ రాశివారి జీవితాల్లో గొప్ప గొప్ప మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.

వృషభ రాశి
ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు, కార్మికులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీరికి దీర్ఘకాలంలో అనేక లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నలుగురి నుంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంది.

మకర రాశి
కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. వ్యాపారస్తులు మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగాలు చేసేవారు కీర్తి ప్రతిష్టలతోపాటు విజయాన్ని సాధిస్తారు. అపారమైన ధనలాభం చూడనున్నారు. గతంలో కంటే ఇప్పుడు డబ్బుపరంగా బలంగా తయారవుతారు.

కన్యా రాశి
గురువు అనుగ్రహంతో జీవితంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఇంట్లో సంపద పెరగడానికి, కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలు పరిష్కారమవడానికి, ఆర్థికంగా బలపడటానికి ఇది మంచి సమయం. జీవితంలో మంచి స్థాయికి వెళ్లే అవకాశాలు లభిస్తాయి. వాటిని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+