వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోక్షాన్ని పొందడం ఎలా?: ఎలాంటి వారికి ఎలాంటి జన్మలు?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: జీవులనబడే నాలుగు లక్షల చావు పుట్టుకలు అనేవి భూమిపై జరుగుతున్నాయి. జగత్తులో మొత్తం 84 లక్షల జీవరాసులు ఉన్నాయి.అందులో మానవ జన్మ చివరిది. ఈ మానవ జన్మ తర్వత మల్లి జన్మ అనేది మానవిని ప్రవర్తనను,లేదా స్థితిగతులను బట్టి ఆపై జన్మలు అనేది నిర్ణయింపబడుతాయి. ఆత్మజ్ఞానం కలిగే వరకు మోక్షంరాదు. మోక్షం వచ్చే వరకు జన్మలు తప్పవు.ఉత్తమమైన సంస్కారం కలవారికి ఉత్తమజన్మలు, నీచ సంస్కారం కలవారికి నీచజన్మలు సంభవిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రతి వ్యక్తీ సుఖం కావాలని కోరుకుంటాడు.. అలాగే దుఖం ఉండకూడదు ఆశిస్తాడు. ఫలానవి సుఖం కలిగిస్తాయని ఆశిస్తే అవి కలిగించే సుఖం కొంచెమే .. వాటి వల్ల కలిగే దుఖం మాత్రం అధికంగానే ఉంటుంది.శరీరం , మనసు, కన్ను, ముక్కు మొదలైన ఇంద్రియాలూ సుఖం కల్గిస్తాయా..! అని ఆలో చించారా ఎప్పుడైనా..సుఖం కన్నా , దుఖమే అధికంగా కల్గిస్తాయి ఇంద్రియాలు.

The-story about how to get moksha

అంతేకాదు దు:ఖానికి కారణాలు కూడా అని తెలుస్తుంది. అదేవిధంగా ప్రపంచంలో కలిగేది దుఖమే..!
శరీరం ఉన్నంత వరకూ మనస్సుకు దు:ఖం తప్పదు . ఈ శరీరం పోయినంత మాత్రాన దు:ఖం పోదు.మల్లి పునర్జన్మ ఉంటుందిట.! దు:ఖం తిరిగి రాకూడదంటే.. శరీరం మరలా రాకూడదట. అంటే మరో జన్మ ఉండ కూడదు అని భావం. దీనినే మోక్షం అంటారు
మన పెద్దలు.

దానిని పొందే మార్గమే దర్శనం అంటాము. మోక్షం గురించి ఎక్కువగా చెప్పేవే దర్శనం లేదా దర్శనాలు అని అంటారు.

దర్శనాలు
అనేవి రెండు రకాలు..

1. ఆస్తిక దర్శనాలు.

2. నాస్తిక దర్శనాలు

The-story about how to get moksha

వేద ఆధారం + స్వంత ఆలోచనతో ముందుకెళ్ళడం ఆస్తికత్వం..
వేదాధారం లేకుండా కేవలం స్వంతాలోచన మీద ముందుకెళ్లడం నాస్తిక దర్శనాలు.

మన ఇంట్లో లైటు వెలిగినా.. ఫ్యాన్ తిరిగినా దానికి వెనుక ఉన్న శక్తి విద్యుత్ శక్తి.. అలాగే కన్ను చూసినా.. చెవి విన్నా.. మనసు ఆలోచించినా.. దాని వెనుక ఉండే శక్తి నే మన పూర్వీకులు ఆత్మ శక్తి అన్నారు.

దానికి ఊరు , పేరు లేవు ఆకారం లేదు. జాతి , మత, వర్ణ వైషమ్యం లేదు. దానికి పుట్టుక నాశనం లేదు. అదే జీవాత్మ,
బ్రహ్మ ము పరబ్రహ్మము..

జీవాత్మ.. అంటే..?
మనసు ఉపాధిగా గల ఆత్మ జీవాత్మ.
పరమాత్మ అనేది అంతటా ఉంటుంది. అది లేని చోటు భూమండలం అంతా వెదికిన దొరకదు.. అది శరీరం, ఇంద్రియాలకంటే మనసుకంటే అతీతం.
అది మనస్సులో కూడా ఉంటుంది. మన మనసుతో కూడిన ఆత్మయే జీవాత్మ .

శరీరం మూడు రకాలు.

1. స్థూల శరీరం : మనకు కనబడే కాళ్ళూ, చేతులు వంటి బాహ్యంగాలు అన్నీ కలిపి మొత్తంగా...

సూక్ష్మ శరీరం . ఐదు జ్ఞానేంద్రియాలు : 1.కన్ను
2.ముక్కు
3.చెవి,
4.నాలుక ,
5. త్వక్కు (చర్మం)

ఐదు కర్మేంద్రియాలు : నాలుక ,చేతులు, కాళ్లూ పాయువు (గుదము), ఉపస్థ(జననేంద్రియం)

ఐదు వాయువులు :
1) ప్రాణ,
2) అపాన,
3)వ్యాస,
4)ఉదాన,
5)సమానములు.


1 బుద్ధి
,1 మనస్సు ఇవి మొత్తం 17
ఈ పదిహేడు కలిసి స్థూల శరీరం లేదా లింగ శరీరం అంటారు.

కనపడే శరీరం పోయినా ఈ సూక్ష్మశరీరం ఉంటుంది. అదే పైలోకాలకు తిరిగేది.

ప్రకృతి,ఆత్మ తప్ప మిగిలినదంతా ప్రకృతియే. మనస్సు, ఇంద్రియాలు, శరీరం, కంపడే అంతా ప్రకృతియే. ప్రకృతినే ప్రధానము, అవ్యక్తము, మాయ అనే పేర్లున్నాయి.మట్టియే కుండగా మార్పుచెందినట్లు ప్రకృతే ఈ జగత్తుగా మారుతుంది.

ధర్మం అంటే దైవానికి ప్రతిరూపం.పురుషార్ధాలు నాలుగు.

1) ధర్మం
2) అర్ధం
3) కామం
4) మోక్షం

దైవప్రతిపాదకమైన ధర్మశబ్ధం పురుషార్ధాలలో ముందు చెప్పబడినది.ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించి,దానితో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకొని,తద్వారా మోక్షం పొందుమని దీని అర్ధం.ధర్మస్వరూపాన్ని తెలిసుకుని,దానిని పాటిస్తూ మంచి ప్రవర్తనతో,ధర్మాన్ని రక్షించాలి.గురునిర్దేశిత సత్ప్రవర్తనతో ధర్మాని రక్షించి మోక్షాన్ని పొందాలి.

ఈ జన్మలో జ్ఞానం కలిగి మోక్షం సిద్దించేంత వరకు ఎన్ని జన్మలైనా కలుగుతూనే ఉంటాయి. ఆ జన్మలు ఇన్ని, ఇవి అని చెప్పడం సాధ్యం కాదు.రానున్న జన్మలు మానవ జన్మ అని చెప్పలేము.కారణం ప్రస్తుత జన్మలో మనం చేసుకున్న కర్మఫలితంగా వచ్చే జన్మ అధారపడి ఉంటుంది.జడ భరతుడనే మొదలైనవారి చరిత్రలు మానవులు తిరిగి పశుపక్షాదులుగా కూడ పుట్టవచ్చుఅని నిరూపించడం జరిగింది.

English summary
The Astrologer told about the story about how to get Moksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X