• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆత్మ శోధన: ఆత్మాన్వేషణ అంటే ఏమిటి?

|

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్: ఆత్మాన్వేషణ అంటే ఏమిటి అనగా గురుదేవులు ఈ ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతారంటే.. వ్యక్తి సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది.

ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే.

ముత్యం కావాలంటే లోపలికి దూకాలి, ఈదాలి, వెదకాలి, ఆల్చిప్పలను పట్టాలి.

అప్పుడే కొన్నైన ముత్యాలు లభిస్తాయి.

అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా ఆ ఆత్మను దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి అంటే అదే అసలు మనం కనుకా! లోచూపు కావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి చూచి అనుభవించి అనుభూతిని పొంది విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు.

తెలియదంటున్నవాడు, తెలిసి తెలియనట్లు ఉన్నదన్నవాడు, తెలుసుకుంటున్నానన్న వాడు ఉన్నారు. తెలుసుకున్న వాడు మాత్రం ఏమీ అనటం లేదు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. మాటలను దాటి మౌనం ద్వారా ప్రసారం చేస్తున్నాడు. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. మనం ఉంటున్న ఇదే ప్రపంచంలో ఉన్నా తనతో తాను ఉంటున్నాడు.

the story about Soul searching

కానీ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కార్యకలాపాలను ఏ ప్రమేయం లేకుండా చూస్తున్నాడు. సర్వానందమయ స్థితిని అనుభవమయం చేసుకుంటున్నాడు. తామరాకుపై నీటిబొట్టు వలె అంటక ఉండగలుగుతున్నాడు. ప్రతి చర్యలోనూ చైతన్యాన్ని, చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తిని నిత్యానుభవం చేసుకుంటున్నాడు.

వస్తువు వెనుక ఉన్న యదార్థాన్ని దర్శిస్తున్నాడు.

ఆ కారణంగా పైపైన జరుగుతున్న విషయాలను అవి కలిగించే ప్రభావాలను గుర్తించకుండా తత్వానుభూతిని పొందుతున్నాడు. ఆ అనుభవమే, ఈ అభ్యాసమే ప్రకృతి రహస్యాలను చూడగల, చూపించగల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తను చేస్తున్నది. ఆ కారణంగా జాతి, మత, వర్గ, వర్ణాతీతమైన మానవతావాదం, శాస్త్రంగా రూపుదిద్దుకొని ప్రకృతి మూలాలలో ఇమిడి ఉన్న సహజ సౌందర్యాన్ని బహిర్గతం చేస్తుంది.

అప్పుడే జగత్తు సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది.

ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే! ఇదంతా నిత్య పరిశీలన, అనుష్ఠానం, సాధన వల్ల సాధ్యమయ్యేదే. సర్వత్రా ఆత్మనీ దర్శించగల స్థితి కలిగిన తరువాత ద్వంద్వాలు లేవు.గుణగుణాలు లేవు. అనేకం లేవు. ఏమీ లేవు. ఉన్నదంతా ఆత్మే అన్న స్థిర భావన స్థిరమవుతుంది. ఆనందం స్వభావమవుతుంది. ఆనంద సాగరంలో తాను నిశ్చలుడై ఉంటాడు.

ఎన్ని అలలు పుట్టనీ, ఎన్ని కెరటాలు ఎగిసిపడనీ, ఎన్ని తుంపరులు తాకనీ, తాను మాత్రం అచలుడై ఉంటాడు. కేనోపనిషత్ ప్రశ్నించుకుంటూ సమాధానం పొందమంటుంది. సాధ్యమైతే, నీ అంతట నీవే ప్రయత్నించమంటుంది. సాధ్యం కాకపోతే గురువును ఆశ్రయించమంటుంది. ఆత్మోన్నతి కలిగించే గురువును అనుసరించమంటుంది. ఆత్మను ఎరిగినవాడు మృత్యు భావనను జయిస్తాడు. భయం లేకుండా ఉంటాడు. ఎందరినో ఆ దారిని నడిపించగల నాయకుడు అవుతాడు.ఎదేగాని సాధనతోనే సాధ్యమౌతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Astrologer told the story about Soul searching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more