దేవశయని ఏకాదశి రోజునే పునర్వసులోకి సూర్యగోచారం.. వీరి పంట పండుతుంది!
2025 సంవత్సరంలో దేవశయని ఏకాదశి జూలై 6వ తేదీ వస్తుంది. ఆషాడ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చే ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతారని చెబుతారు. దేవ శయని ఏకాదశి రోజునే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అటువంటి దేవ శయని ఏకాదశి రోజు అంటే జూలై ఆరవ తేదీన గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు పునర్వసు నక్షత్ర సంచారం చేస్తున్నాడు.
పునర్వసు నక్షత్రంలోకి సూర్య సంచారం
సూర్యుడు పునర్వసు నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. అటువంటి గురువు నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సూర్యుడు సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
పునర్వసు నక్షత్రం లోకి సూర్య సంచారం మేష రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఒప్పందాల నుండి డబ్బు ప్రయోజనాలను పొందుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు తగ్గి సంతోషంగా జీవిస్తారు. ఇది మేషరాశి వారికి అన్ని విధాల శుభ ఫలితాలను ఇచ్చే సమయం.
సింహరాశి
పునర్వసు నక్షత్రంలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో జీవితంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బు ప్రయోజనాలు చేకూరుతాయి. సింహ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకులు ఏ పని చేసిన అదృష్ట జాతకులుగా మారుతున్నారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. గురువు నక్షత్ర మండలంలో సూర్యుడు సంచారం చేయడం వల్ల కన్య రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇది వీరు ఉద్యోగాలు మారడానికి అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో కన్యా రాశి వారు ఆర్థికంగా బలపడతారు. గురువు కారణంగా సంతానం స్థితి బాగుంటుంది. ఈ సమయంలో వీరు సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఏ పని చేసిన వీరికి సానుకూలమైన ఫలితాలు వస్తాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications