రేపటినుండి ఈ రాశులవారికి జాక్ పాట్.. వెలిగిపోతారన్న సూర్యుడు
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల రాజుగా చెప్పే సూర్యభగవానుడికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలంలో సంచారం చేస్తూ ఉంటాడు. సూర్య సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో మార్పులు వస్తాయి.
మీనరాశిలో సూర్య సంచారం
మార్చి 15వ తేదీన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నెలరోజుల పాటు సూర్యుడు మీన రాశిలో సంచారం చేస్తాడు. మీనరాశికి గురువు అధిపతి. సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్యుడు మీన రాశిలో సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మిధున రాశి
సూర్య సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్టవంతులు అవుతున్నారు ఈ రాశిలో పదవ పాదంలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు. సూర్య సంచారం ఫలితంగా మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తుంది. అన్ని ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి కూడా బాగుంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో నాలుగో పాదంలో సూర్య సంచారం జరుగుతుంది. దీనివల్ల ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి అనేక మార్గాల ద్వారా డబ్బులు వస్తాయి. నూతన గృహాలు, భూములు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు కలిసి వస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మీన రాశి
మీనరాశిలో సూర్యభగవానుడు సంచారం మీన రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో బాగా పెరుగుతుంది . కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలలో మంచి పురోగతి ఉంటుంది. పెళ్ళికాని వారికి వివాహ యోగం ఉంది. ఇది మీన రాశి వారికి కలిసొచ్చే కాలం.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications