చిత్తా నక్షత్రంలో కేతువు... ఈ రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి

కేతువు జూన్ 26వ తేదీన చిత్త నక్షత్రంలోకి ప్రవేశించింది. ఈ ప్రభావం 5 రాశులవారిపై ప్రభావాన్ని చూపుతోంది. కేతువుకు భౌతిక రూపం లేదు. ఇది తిరోగమన గ్రహం. కేతువు సంచారం వృత్తి, కుటుంబ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆర్థిక సమస్యలతోపాటు అనేక సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఏయే రాశులవారు ప్రభావితమవుతారో తెలుసుకుందాం.

మిథునరాశి : ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శృంగారానికి సంబంధించిన బంధాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. చదువులపై దృష్టి పెట్టడమనేది విద్యార్థులకు సవాల్ గా మారుతుంది. పెద్దల మాటలను పిల్లలు వినకపోవడంవల్ల వారికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

horoscope1

కర్కాటక రాశి : ఈ రాశివారి నాలుగో ఇంట్లో కేతువు ఉంటాడు. తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. సానుకూల వాతావరణం ఉండదు. పరిస్థితులన్నీ నెమ్మదిగా సద్దుమణుగుతాయి.

కన్యారాశి : మాటలవల్ల అపార్థాలు తలెత్తుతాయి. మాటతీరువల్లే కుటుంబానికి దూరమవ్వాల్సి ఉంటుంది. పదజాలం తీవ్రంగా ఉంటుంది. ఆదాయంలో ఎక్కువ తక్కువలుండటంవల్ల డబ్బును ఆదా చేయడం సవాల్ గా మారుతుంది. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.

మకర రాశి : తండ్రితో విభేదాలు తలెత్తుతాయి. తీవ్రంగా శ్రమిస్తేనే విజయం సాధించగలుగుతారు. వృత్తి జీవితంలో కూడా అనేక ఇక్కట్లు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. సమాజంలో మీకున్న కీర్తి ప్రమాదంలో పడుతుంది. దాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం.

మీనరాశి : ఈ రాశివారికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన తలెత్తుతుంది. మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రమాదాలు, వ్యాధులు పొంచివున్నాయి. కష్టాలు పెరగడంతోపాటు ఆందోళన కూడా పెరుగుతుంది. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+