రక్షా బంధన్ రోజు గ్రహాల కలయిక... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బే డబ్బు
అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్లు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ రక్షా బంధన్ (Rakshabandhan). సోదరుడు సుఖంగా ఉండాలని సోదరీమణి రక్ష కడుతుంది. సోదరికి రక్షగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. ఈ పండగ ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోనున్నారు. రాఖీ పౌర్ణమి (పూర్ణిమ) రెండు రోజుల్లో రానుంది. దృక్ పంచాంగ్ ప్రకారం రక్షా బంధన్ ప్రధాన రోజు ఆగస్టు 30వ తేదీ. అయితే భద్ర కాళు కారణంగా రాఖీ కట్టే శుభ సందర్భాన్ని ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించవచ్చు.
రాఖీపౌర్ణమి రోజు అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. దీనివల్ల మూడు రాశులవారికి విపరీతమైన లాభాలు కలగనున్నాయి. రక్షా బంధన్ రోజున సూర్యుడు, బుధుడు, చంద్ర గ్రహాలు అనుకూలమైన అమరికలో ఉంటాయి. దీన్ని రవి యోగం, శతభిషా నక్షత్రం, బుధాదిత్య యోగం అంటారు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత అరుదైన కలయిక జరగబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. విజయాన్ని, సంపదను కలిగించే రవి యోగం అత్యంత శక్తివంతమైన యోగం.

అలాగే ఆధ్యాత్మికత, శాంతితో శతభిషా నక్షత్రం ముడిపడివుంటుంది. బుధుడు తెలివితేటలను, అదృష్టాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ను ఇస్తుంది. రక్షా బంధన్ రోజున ఈ మూడు గ్రహాలు కలవడంవల్ల కొన్ని రాశులవారి జీవితం మారిపోనుందని, సంపద భారీ ఎత్తున వస్తుందని, వ్యాపారాలు కూడా విపరీతంగా వృద్ధి చెందుతాయని చెబుతున్నారు.
ధనస్సు రాశి : అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ధనాభివృద్ధి ఉంది.
మిథున రాశి : ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బును సంపాదించడంతోపాటు పొదుపు కూడా చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
సింహ రాశి : వీరికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. సంపద పెరుగుతుంది. రాఖీ పర్వదినం రోజు, ఆ తర్వాత నుంచి వారు పెట్టే పెట్టుబడులు మంచి ఆదాయాన్ని ఇస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.












Click it and Unblock the Notifications