బుధాదిత్య యోగంతో ఈ రాశులవారిపై కనక వర్షం

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. బుధుడిని ఫ్లానెట్స్ ప్రిన్స్ అంటారు. రవి ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. జూన్ 24న బుధుడు అదే రాశిలోకి ప్రవేశించాడు. ఈ రెండింటి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సూర్యుడు, బుధుడి కలయిక అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ కొన్ని రాశులవారు అత్యధిక ప్రయోజనాలను పొందనున్నారు. ఏయే రాశులవారనేది తెలుసుకుందాం.

మేషరాశి:సూర్యుడు, బుధుడి సంయోగం మేషరాశి వారికి ఎంతో ప్రయోజనకరం. వ్యాపారస్తులకు వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. వారి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. తద్వారా వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లతోపాటు పదోన్నతులు కూడా పొందుతారు.

Sun is considered as the king of planets in astrology.

వృషభరాశి:బుధాదిత్య రాజయోగం వృషభరాశి వారికి లాభం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడటంతోపాటు సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యం ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు.

మిథునరాశి:సూర్యుడు, బుధుడి కలయికతో ఏర్పడిన బాధాదిత్య రాజయోగంవల్ల వీరికి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఖర్చులు తగ్గడంతోపాటు కుటుంబ సమస్యలు దూరమవుతాయి. పరిశోధన పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్తారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

ధనుస్సు రాశి:ఈ రాశివారికి బుధాదిత్య యోగం సంతోషాన్ని కల్పిస్తుంది. పూర్వీకులనుంచి ఆస్తి పొందడంతోపాటు వ్యాపారస్తులకు వారి వ్యాపారం భారీగా వృద్ధి చెందుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు వారి ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+