సెప్టెంబరు 17 లోగా కోటీశ్వరుల్ని చేయనున్న బుధాదిత్య రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక రాశిలోకి ప్రవేశిస్తుంటుంది. అది ప్రవేశించిన సమయంలో మరో గ్రహం కనుక అక్కడే ఉంటే ఈ రెండింటి కలయికవల్ల యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ రీతిలోనే సూర్యుడు, బుధుడి కలయికతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం ప్రభావం కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తోంది. సూర్యుడు ప్రతి రాశిలో నెలరోజులు ఉంటాడు. సెప్టెంబరు 17వ తేదీ వరకు సూర్యుడు సింహరాశిలో కొనసాగుతాడు. సింహరాశిలో సూర్యుడి, బుధుడి కలయికతో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ఎవరెవరికి కలిసి రానుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి: ఈ రాశివారికి బుధాదిత్య రాజయోగం కలిసివస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఆదాయానికి ఇతర మార్గాల ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా పటిష్ఠమైన స్థితిని కలిగివుంటారు. గతంలో ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఊహించనిరీతిలో ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

తులా రాశి: బుధాదిత్య రాజయోగం వీరికి అనేక ప్రయోజనాలను తెస్తుంది. ముందుగా అప్పుల నుంచి విముక్తులవుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల్ని అందజేస్తాయి. ప్రజాదరణ కూడా రోజురోజుకు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఈ యోగం ప్రభావం వీరి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఉద్యోగస్తులుకు ఆదాయ మార్గాలు పెరగడం లేదంటే ఆదాయం పెరగడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. వ్యాపారస్తులు లాభాలబాటలో పయనిస్తారు.
మేష రాశి: సెప్టెంబరు 17 వరకు ఈ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు ఊహించని విజయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కలిపి ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు అత్యధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications