ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు
జ్యోతిష్యంలో గ్రహాలు కలయికకు విశేషమైన ప్రాధాన్యం ఉంటుంది. ఒకే రాశిలో కొన్ని ప్రత్యేక గ్రహాలు కలవడంవల్ల శుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాలకు రాకుమారుడు, అన్ని గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు తులా రాశిలో సంచారం చెయ్యబోతున్నాడు. నవంబరు 6వ తేదీన బుధుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా 12 రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించనున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి:సూర్యుడు, బుధుడి కలయిక ఈ రాశివారికి వరం లాంటిది. భౌతికపరమైన సుఖాలను అనుభవించడమే కాకుండా కుటుంబ సభ్యలతో సంతోషంగా గడుపుతారు. తల్లితో అనుబంధం మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్తగా వాహనాలతోపాటు ఆస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు.

సింహరాశి:ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి వేతనాలు పెరుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి అదృష్టం తోడుంటుంది. భాగస్వామిగా వ్యాపారం చేసేవారు కూడా ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. మాట్లాడే మాటలవల్ల ఎదుటిావరు ఆకర్షితులవుతారు.
ధనుస్సు రాశి:బుధాదిత్య రాజయోగం ఈ రాశివారికి ఎంతో శుభప్రదమని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. వ్యాపారాలు చేసేవారికి కొత్తగా ఆఫర్లు వస్తాయి. భాగస్వామిగా వ్యాపారం చేసేవారు ఊహించనిరీతిలో లాభాలను పొందుతారు. రాజకీయంగా విశేషమైన సేవలందిస్తున్నవారికి విజయం వారితోపాటే ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం దొరుకుతుంది.












Click it and Unblock the Notifications