30 ఏళ్ల తర్వాత అద్భుత కలయిక.. ఈ రాశులవారు మహారాజులే

శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా ఫిబ్రవరి నెలలో కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు, శని కుంభరాశిలో సంయుక్తంగా సంచరించడమనేది దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ మూడు రాశులవారిపై మాత్రం ఆర్థిక లాభాలుంటాయి. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

కుంభరాశి : శని, బుధుడి కలయిక ఈ రాశిలోని లగ్న గృహంలో జరుగుతోంది. శని కుంభ రాశికి అధిపతి. విద్యను నేర్చుకునే విషయంలో పెరుగుదల ఉంటుంది. సృజనాత్మక రంగంలో కూడా ఎంతో మెరుగుపడతారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఆర్థికంగా బాగుండటానికి ప్రణాళికలు అల్లుకునే మంచి సమయం ఇది. వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది. బుధుడి ప్రభావంవల్ల ఉద్యోగస్తులతోపాటు వ్యాపారస్తులకు కూడా లాభం ఉంది. రోజువారీ ఆదాయంమీద ఆధారపడినవారి ఆదాయం పెరుగుతుంది.

these zodiac sign people are very lucky due to conjunction of shani and bhudha

మిథునరాశి : మిథున రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో శని, బుధుడి కలయిక జరగబోతోంది. అదృష్టం తోడుగా ఉంటుంది. విదేశాలతో సంబంధం ఉండే వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలున్నాయి. పనికోసం దూర ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణంవల్ల ఎంతో లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన లేదంటే మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఎక్కువవుతుంది.

సింహ రాశి : సింహ రాశి నుంచి ఏడో ఇంట్లో బుధుడు, శని కలయిక జరగబోతోంది. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. దంపతులిద్దరికీ ఒకరిపై మరొకరికి అభిమానా పెరుగుతుంది. ఒంటరిగా ఉండేవారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కెరీర్ లో సానుకూల ఫలితాన్ని పొందుతారు. పనిచేసేచోట గొప్ప అవకాశాలు లభిస్తాయి. సింహరాశిలో శని షష మహాపురుష రాజయోగాన్ని ఏర్పరచడంతో రోజువారీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+