100 ఏళ్ల తర్వాత నాలుగు మహా రాజయోగాలు.. ఈ 3 రాశులకు మహదైశ్వర్యం
జ్యోతిష్యంలో ఏర్పడే యోగాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కొన్ని గ్రహాలు శుభ స్థానాల్లో సంచారం చేసినప్పుడు ఇవి ఏర్పడతాయి. దీనివల్ల కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయి. వివిధ గ్రహాలు రాశిని మార్చినప్పుడల్లా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. సుమారు 100 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నాలుగు మహారాజయోగాలు ఏర్పడ్డాయి.
బుధాదిత్య రాజయోగం, శష మహాపురుష రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం, శుక్ర, కుజుడు, శని గ్రహాల సమాసప్తక రాజయోగం. ఈ రాజయోగాలు 3 రాశుల వారికి విపరీతమైన సంపదనను కలిగిస్తాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.
కుంభ రాశి: ఈ రాశి 6వ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. సంచార జాతకంలో శష, సంసప్తకం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ వ్యాపారానికి సంబంధించినవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రాశి వారికి ఈ నాలుగు మహా రాజయోగాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే మీ రాశిలోని ఆరవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం

వృషభ రాశి: 3వ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది.ఇదే సమయంలో శుక్ర-కుజుడు-శని గ్రహాల సమాసప్తక రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం, శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతున్నాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు బాగుంటుంది. అదృష్టం తోడుంటుంది. తక్కువ శ్రమతో ఆదాయాన్ని పెంచుకుంటారు. కార్మికులకు పదోన్నతులతోపాటు వేతనాల్లో పెంపు ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి అదృష్ట స్థానంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది.అదృష్టవంతులవుతారు. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు లాభాలనిస్తాయి. చేసే పనిలో ధైర్యం పెరుగుతుంది. ప్రయాణం ఉంటుంది. ప్రసంగాలలో సానుకూలత వ్యక్తమవుతుంటుంది. ఇతరులను మీవైపు ఆకర్షిస్తారు.












Click it and Unblock the Notifications