దీపావళికన్నా ముందే ఈ రాశులకు లక్ష్మీ కటాక్షం
దీపావళికి ముందు రాహువు, కేతువు 13 నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించబోతున్నారు. అక్టోబరు 30న జరిగే ఈ సంచార ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై ఉంటుంది. కొందరు రాహువు, కేతువు నుంచి విశేషమైన ప్రయోజనాలను పొందనున్నారు. అలా లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి:రాహువు, బృహస్పతి మేషరాశిలో ఉండటం వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కెరీర్ లో విజయం సాధించేందుకు ఇదే సరైన సమయం. వ్యాపారస్తులకు బాగుంటుంది. వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. అవి కూడా మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటక రాశి:వీరు చేపట్టే ప్రతి పనిలో సక్సెస్ అవుతారు. జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పనితీరులో మెరుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగాన్ని పొందడానికి, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ సాధించడానికి ఇది మంచి తరుణం.
సింహ రాశి:వీరికి అంతా శుభప్రదంగా ఉంటుంది. జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. విహార యాత్రకు వెళతారు. అదృష్టం తోడుంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. దీనివల్ల అనుబంధాలు బలోపేతమవుతాయి. వృత్తి జీవితంలో మంచి లాభం ఉంది. పనిచేసే చోట ప్రతిష్ట పెరుగుతుంది.
మీనరాశి:ఉద్యోగ జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. ఏ పనికి ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కొత్త ఒప్పందాలుంటాయి. లాభాలు భారీస్థాయిలో వస్తాయి. దీపావళికి ముందే రాహు-కేతువుల సంచారం జీవితంలోని అన్ని సమస్యలను దూరం చేస్తుంది. 2025 మే 18వ తేదీ వరకు వీరికి ఎంతో అనుకూలమైన సమయం.












Click it and Unblock the Notifications