అక్టోబరు 30 నుంచి ఈ రాశులవారికి ఆర్థిక లాభాలు
జ్యోతిష్యంలో రాహువు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. రాహువు సంచార ప్రభావం అన్ని గ్రహాలపై ఉంటుంది. అక్టోబరు 30వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించనుంది. అనంతరం మీనరాశిలోకి వెళుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారు ఎలా ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి: రాహువు సంచారం వీరికి వరం లాంటిది. ఆర్థికంగా లాభాలుంటాయి. ఎప్పటినుంచో ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి కాస్తంత ఉపశమనం దొరుకుతుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

కర్కాటక రాశి: వీరికి దీర్ఘకాలిక లాభాలున్నాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. రాహువు సంచారం వల్ల కొత్త ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.
సింహ రాశి: వీరు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలుంటాయి. రాహువు సంచార క్రమంలో శివుడికి అభిషేకం చేయడంవల్ల మంచి లాభాలను పొందుతారు.
మీన రాశి: ఈ రాశివారికి ఎంతో మేలు కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతంలో ఒకచోట నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో సులభంగా చేతికి అందుతాయి.












Click it and Unblock the Notifications