2024 జూన్ వరకు వీరు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో సంచరిస్తుంటుంది. దీన్ని గోచారం లేదంటే రాశి పరివర్తనం అంటారు. అదే సమయంలో వివిధ రాశుల్లోకి సక్రమం లేదంటే వక్ర మార్గం కూడా పడుతుంటాయి. ఇలా జరుగుతుండటంవల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయి.
శనిగ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. ఈ సమయంలో మూల త్రికోణ రాశి కుంభంలో శని వక్రమార్గంలో ఉన్నాడు. దీనివల్ల 2024 జూన్ వరకు కొన్ని రాశులవారిపై కనక వర్షం కురవనుంది. కుంభరాశిలో 30 సంవత్సరాల జరుగుతున్న పరిణామం ఇది. 2023 జనవరిలో శని కుంభరాశిలోకి ప్రవేశించింది. నవంబరు నాలుగో తేదీ వరకు ఇలాగే వక్రమార్గంలో ఉంటాడు. వచ్చే ఏడాది జూన్ తర్వాత వక్రమార్గం నుంచి సక్రమ మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఏయే రాశులవారికి ఎంత లాభం కలగనుందో తెలుసుకుందాం.

తులా రాశి: వీరికి ఎంతో అద్భుతంగా ఉండనుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా విజయవంతమే. అదృష్టం తోడుగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించని ప్రయోజనాలున్నాయి. ఆర్థిక పరిస్థితి పటిష్ఠంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వృషభ రాశి: వీరికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. చేపట్టే ప్రతి పనిలో విజయవంతమవుతారు. గతంలో మొదలై పూర్తికాకుండా నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ధనలాభం ఉంది. ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు.












Click it and Unblock the Notifications