ఈ రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతున్నాయి
అష్టగ్రహాల్లో ఒకడైన శనిదేవుడు సూర్యదేవుడి కుమారుడు. ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో సంచరిస్తున్న శని నవంబరు 4 నుంచి నేరుగా సంచరించనున్నాడు. వ్యక్తి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటే వారికి ఎందులోను లోటుండదు. ఒక రాశి నుంచి మరోరాశిలోకి ప్రవేశించడానికి శనికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. శని ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం.
మిథునరాశి:శని కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది మిథున రాశివారికి మంచి ఫలితాలను అందజేస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బలోపేతమవుతారు. మంచి సమయం మీదే అవుతుంది. భూమి లేదంటే వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్ లో మంచి పురోగతి ఉండటంతోపాటు జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.

వృషభరాశి:ఈ రాశివారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకరకంగా వీరికి మంచిరోజులు ప్రారంభమైనట్లే. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంది. అందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది.
సింహరాశి:సింహరాశివారు మంచి ఫలితాలను సాధిస్తారు. వీరు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవడంతో సంతోషం వెల్లివిరుస్తుంది. ఊహించనిరీతిలో లాభాలున్నాయి. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతం కావడంతో తన సలహాలు, సూచనల మేరకు చేసే పనులు విజయవంతమవుతాయి.












Click it and Unblock the Notifications