శ్రావణ మాసం.. రేపటి నుంచి ఈ రాశులవారికి ఊహించని లాభాలు
అమావాస్య తర్వాత రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. మంచి ఘడియలు మొదలవుతాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి ధనలాభం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వారి అదృష్టం కూడా రెట్టింపవుతుందని చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం. ప్రధానంగా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని లాభాలున్నాయని, ఆర్థికంగా బలపడతారని తెలియజేస్తున్నారు.
సింహ రాశి: జీవిత భాగస్వామితో ఉన్న ప్రేమ బంధం మరింత బలపడుతుంది. తెలివితేటలవల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. అనారోగ్యంపాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంద్వారా ఇబ్బందుల నుంచి బయటపడతారు.కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని కేటాయిస్తారు.

కర్కాటక రాశి: శ్రావణ మాసంలో కర్కాటక రాశివారికి అనేక లాభాలు కలగనున్నాయి. విలాసవంతమైన జీవితాన్ని పొందనున్నారు. ఆర్థికంగా కలిసి రావడంవల్ల లాభాలను పొందడంతోపాటు ఫైనాన్షియల్ గా బలపడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేయడంవల్ల చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ తెలివితేటలతో వాటిని పరిష్కరిస్తారు.
మేష రాశి: పిల్లల నుంచి శుభవార్తను వింటారు. వారివల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామితో సంప్రదించి చేయడంవల్ల ఆ పని విజయవంతమవడంతోపాటు అదృష్టం రెట్టింపవుతుంది. ఊహించనిరీతిలో సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది.












Click it and Unblock the Notifications