కన్యారాశిలోకి సూర్యుడు.. వీరికి అన్నీ కష్టాలు, నష్టాలే
జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహాలకు రారాజు. ఈనెల 17వ తేదీన భానుడు సింహ రాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించాడు. అక్టోబరు 17వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. సూర్యుడి గోచారం వల్ల అన్ని గ్రహాలపై ప్రభావం ఉంటుంది. అయితే మూడు రాశులపై మాత్రం మరింత ఎక్కువగా ఉండబోతోంది. మిథున రాశి, మేష రాశి, వృషభరాశి వారికి అనుకూలం కంటే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి. వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశివారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్వీకుల నుంచి వస్తున్న వ్యాపారాన్ని వారసత్వంగా చేస్తున్నవారు పెద్దల సూచనల ప్రకారం కొనసాగిస్తుంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అలా కాకుండా సొంత నిర్ణయాలపై ఆధారపడితే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిథున రాశి: వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వీరు వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసేచోట ఎవరితోను వివాదానికి దిగకూడదు. పనిపైనే శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వ పనులైతే ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి సంప్రదింపులతో చేసే పనే విజయవంతమవుతుంది. లేదంటే నష్టాలను, కష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
మేష రాశి: ప్రభుత్వ రుణాలను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి అదృష్టం భాగస్వామి రూపంలోనే ఉంటుంది. కొత్త వ్యాపారం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది అనువైన సమయం కాదు. ఉద్యోగస్తులకు కూడా ఇది మంచి సమయం కాదు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications