సూర్యుడు, కుజుడి సంచారం.. 4 రాశులవారికి భోగభాగ్యాలే
సూర్యుడు, కుజుడు తమ కదలికలను మార్చుకోబోతున్నారు. దీనివల్ల నాలుగు రాశులవారికి బాగా కలిసి రానుంది. వాస్తవానికి ఈ గ్రహాల సంచారం అన్ని రాశులపై ప్రభావం ఉంటున్నప్పటికీ మిథునం, కన్య, సింహరాశి, ధనుస్సు రాశులవారికి విశేష ప్రయోజనాలను కలిగిస్తోంది. ఈనెల 17న సూర్యుడు సింహరాశిలోకి, 18వ తేదీన కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. వారిద్దరూ రాశిచక్రాలను మార్చగాలనే ఈ రాశులవారి భవితవ్యం చాలా బాగుంటుంది. వీరికి ఏవిధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.
మిథున రాశి :వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం ఉంది. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. విద్యకు సంబంధించిన పనుల్లో మంచి ఫలితాలుంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. పాత మిత్రులను కలుస్తారు.

సింహరాశి : వీరి మనసు సంతోషంతో నిండిపోతుంది. పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కనపరుస్తారు. పనిచేసేచోట పరిస్థితి మెరుగపడుతుంది. ఉద్యోగంలో మార్పుంది. ఖర్చులు తగ్గడంవల్ల కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. విద్యాపరమైన పనుల్లో పురోగతి ఉంటుంది. రీసెర్చి కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. వాహన యోగం కనపడుతోంది.
కన్య రాశి : ఆత్మవిశ్వాసపు స్థాయి పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో స్థానం మారుస్తారు. పూర్వీకుల నుంచి ఆస్తి దక్కుతుంది. స్థరాస్తులద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. సోదరుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. స్నేహితుడి సహాయంతో ఆర్థికంగా బలోపేతమవుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు వస్తాయి.
ధనుస్సు రాశి : తండ్రి నుంచి సహకారం లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగంలో స్థానం మార్పు ఉంది. విద్యకు సంబంధించిన పనులు కలిసివస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగవుతుంది. వాహనయోగం కనపడుతోంది. భవిష్యత్తుపై ఆందోళన తగ్గతుంది. ఆగిపోయిన బకాయిలు చేతికందుతాయి.












Click it and Unblock the Notifications