శుక్రాదిత్య రాజయోగంతో ఈ రాశులు మట్టి పట్టినా బంగారమే అవుతుంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాధాన్యత కలిగిన శుక్రుడు ఈనెల 19వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో సూర్యుడు కూడా కలవనున్నాడు. వీరిద్దరి కలయికవల్ల శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోందని పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులవారికి బాగా కలిసిరానుంది. అదృష్టం తోడుండి అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేయడంతోపాటు ఇతర లాభాలు కూడా కలుగుతాయని తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
శుక్రాదిత్య రాజయోగంతో వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు చేతికి అందుతాయి. వ్యాపారాలన్నీ లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. మధురంగా మాట్లాడి పనులు పూర్తిచేసుకుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు.

వృషభ రాశి
ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో పురోగతి ఉంటుంది. పనితీరుపై ప్రశంశలు దక్కుతాయి. కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఐశ్వర్యం రెట్టింపు అవడంవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సంతోషంగా జీవిస్తారు. అదృష్టం తోడుండటంవల్ల ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు.
కర్కాటక రాశి
వీరికి అనేక లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తిచేస్తారు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో విజయం దక్కుతుంది. పెట్టిన పెట్టుబడులవల్ల మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంతోపాటు ఉద్యోగంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి కలుగుతుంది.












Click it and Unblock the Notifications