విషయోగంతో ఈ రాశులకు దరిద్రం పట్టుకుంటోంది
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారతాయనే విషయం తెలిసిందే. ఈరోజు (ఈనెల 27వ తేదీ) శనిదేవుడు, చంద్రుడు కలిశారు. దీనివల్ల ప్రమాదకరమైన విషయోగం ఏర్పడింది. ఈ ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. అయితే ఈ విషయోగం ప్రభావం కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించగా అక్కడ శనిదేవుడు ఉన్నాడు. దీనివల్ల ఏర్పడుతున్న విషయోగం కలిగించే ప్రతికూల ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అదనపు పనిభారంతోపాటు ఖర్చులు పెరగడం లాంటివి ఉన్నాయి. ఏ రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈ విషయోగం నుంచి రక్షించుకోవడానికి మంగళవారం, శనివారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి హనుమంతుడిని పూజించడంతోపాటు హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజు శనిదేవుడికి ఆవనూనెను సమర్పించాలి.
కర్కాటక రాశి
ఈ రెండున్నర రోజులు కొత్త పనిని ప్రారంభించొద్దు. అంతేకాదు.. ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉద్యోగం చేసేచోట తోటి ఉద్యోగులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. వెంటనే వాటిని నియంత్రించుకునేందుకు తెలివిగా ఆలోచించుకోవాలి.

కన్యారాశి
ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. న్యాయపరమైన విషయాలకు సంబంధించి కోర్టుల్లో ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు చాలా ఇబ్బందులున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకున్నట్లే అవుతుంది.
కుంభరాశి
ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విషయోగం ఈ రాశివారిపై చాలా ఎక్కువగా ఉంటోంది. ఎవరితోను ఏ విషయంలో వాదించకుండా ఉంటే అదే మీకు మంచి చేస్తుంది. దీన్ని విస్మరిస్తే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త లేకపోతే ఆర్థికంగా నష్టాలున్నాయి. అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
ఈ రెండున్నర రోజులు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు పూర్తిచేయడానికి తొందరపడతారు. ఖర్చులు పెరిగి చాలా ఇబ్బందులు పడతారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే పని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications