ఈ నెల రోజులు ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో అనేక యోగాలు ఏర్పడతాయి. యోగాలు మనిషిని ఉన్నతస్థాయికి తీసుకువెళతాయి. త్రిగ్రాహి యోగం, రుచక్ రాజయోగం, గజకేసరి రాజయోగంలాంటివి ఏర్పడుతుంటాయి. వీటివల్ల ఊహించనిరీతిలో ధనలాభం కలుగుతుంది. ప్రస్తుతం సెప్టెంబరు ఆరోతేదీన భద్ర రాజయోగం ఏర్పడనుంది.
భద్ర రాజయోగం కొన్ని రాశులకు విశేష ప్రయోజనాలను కలిగిస్తోంది. శని, బుధ, గురుడు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల గతంలో మొదలై నిలిచిపోయి పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీని వల్ల ఆయా రాశుల వారికి ఆగిపొయిన పనులు కూడా మరల ప్రారంభమౌతాయి.

మీనరాశి
ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే డబుల్ అవుతాయి. అంతేకాదు.. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి.
మేషరాశి
ఈ రాశివారికి ఎప్పటినుంచో సోదరులతో ఉన్న వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. అలాగే బంధువులతో కొనసాగుతున్న వివాదాలు కూడా సమసిపోతాయి. ప్రధానంగా తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి, సహచర ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
ధనస్సు
భ్రద రాజయోగం వల్ల ఈ రాశివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రానున్న రోజుల్లో వీరికి లాటరీ తగిలే అవకాశం ఉంది.
తుల
గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. న్యాయపరమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications