క్రిస్మస్ నుండి ఈ రాశులవారికి స్టార్ మొదలైంది!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తుంది. ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి గ్రహాల సంచారం కొనసాగుతుంది . నేడు డిసెంబర్ 25వ తేదీన చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులారాశిలో చంద్రసంచారం మన జీవితాలను, జాతకాలను ప్రభావితం చేస్తుంది. అయితే ఈరోజు క్రిస్మస్ పర్వదినం రోజున గ్రహాలసంచారం కారణంగా ఏ రాశుల వారికి లబ్ధి చేకూరబోతుంది తెలుసుకుందాం.
మేష రాశి
మేషరాశి వారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. మేషరాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రయాణాలు చేసే వారికి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. నేటి నుంచి మేషరాశి వారికి అదృష్ట సమయం మొదలవుతుంది. చంద్ర సంచారంతో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

సింహరాశి
సింహ రాశి వారికి చంద్రుని రాశి మార్పు కలిసి వస్తుంది. నేటి నుంచి వీరికి గోల్డెన్ డేస్ మొదలవుతున్నాయి. ఈ సమయంలో సింహ రాశి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ధార్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి నేటి నుండి చంద్రసంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. క్రిస్మస్ పండుగ నుండి ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. కుంభరాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఇది కుంభ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకమైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications