నీచ భంగ రాజయోగంతో ఈ రాశులకు స్వర్ణయుగం ప్రారంభం!
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు కారకుడు. కళలు, ఫ్యాషన్ రంగాలకు కారకుడు. ఈ నెలలో సింహరాశిలో, అక్టోబరులో కన్యారాశిలో సంచారం చేస్తాడు. ఈ సమయంలోనే నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది. మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతున్నప్పటికీ కొన్ని రాశులకు మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధించనున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. నీచభంగ రాజయోగంతో ఎటువంటి ఫలితాలు కలగనున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనస్సు రాశి
ఉద్యోగస్థులకు తమ కార్యాలయాల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. దీంతోపాటు వేతనం కూడా పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థికంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు ఊహించనిరీతిలో ప్రయోజనాలున్నాయి.

మకర రాశి
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. కుటుంబ జీవితం మాత్రం ఆనందకరంగా సాగుతుంది. దేశంలో కూడా ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి
ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వాటిల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి లాభాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. సౌకర్యాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా ఆదాయ వనరులు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications