రాసిపెట్టుకోండి.. ఈ రాశుల జీవితం మారిపోతోంది.. రాహువు హామీ
జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రాహువు సంచారం చేస్తే రాశుల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. కొందరికి మంచి ప్రయోజనాలు కలిగితే, మరికొందరికి వారి కర్మానుసారం నష్టం చేకూర్చే ప్రయోజనాలు కలుగుతాయి. 18 నెలలకోసారి రాశిని మార్చే రాహువు వచ్చే ఏడాది మార్చి వరకు మీనరాశిలో ఉంటుంది.
అలా ఉంటూనే తరుచుగా నక్షత్ర సంచారం కూడా చేస్తుంటుంది. ఇది రాశులవారికి అనేక ప్రయోజనాలను కలిగించే పరిణామంగా మారుతుంది. అలాగే కర్మలనుబట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శని ఉత్తరాభాద్రలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహువు కూడా ఇదే నక్షత్రం మూడోపాదంలో సంచరించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

కుంభరాశి
ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. ఇవి కూడా గతంలో డబ్బులు పొదుపు చేయడంవల్ల సాధ్యపడుతుంది. అద్భుతమైన జ్ఞాపకశక్తి చేకూరుతుంది. ప్రధానమైన విషయాలకు సంబంధించి ఆచితూచి, ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దీనికోసం పెద్దలను సంప్రదించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలు తొలగిపోతాయి.
మకర రాశి
ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. దీంతోపాటు పదోన్నతి కూడా ఉంది. వీరికి ఊహించని రీతిలో ఆర్థిక లాభాలున్నాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నవంబరు 10వ తేదీ నుంచి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దలకు ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి
నవంబరు రెండోతేదీ నుంచి వీరికి చాలా బాగుంటుంది. కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. ఒత్తిడి నుంచి విముక్తి లభించి మనశ్శాంతిని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications