చిత్తా నక్షత్రంలో శుక్రుడు.. ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు సంపదకు, ఐశ్వర్యానికి కారకుడు. దీంతోపాటు సంతోషాన్ని, శ్రేయస్సును, శాంతిని ప్రసాదిస్తాడు. శుక్రుడు సంచారం చేస్తే కొన్ని రాశులవారికి అన్నీ శుభ పరిణామాలే జరుగుతాయి. ఈనెల 13వ తేదీ ఉదయం మూడు గంటలకు శుక్రుడు చిత్త నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతున్నప్పటికీ ప్రధానంగా మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను కలిగించనుంది. ఏయే రాశులకు ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
తులారాశి
ఈ రాశివారికి రేపటి నుంచి ఊహించని రీతిలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అలాగే ఆర్థికంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు సమస్యలు పెరుగుతాయి. తెలివితేటలతో వీటిని పరిష్కరించుకొని వ్యాపారాన్ని రక్షించుకోవాలి. ఉద్యోగస్తులకు వేతనాలు పెరగడంవల్ల సంపాదనలో భారీ పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.

మిథున రాశి
రేపటి నుంచి ఈ రాశివారికి ఆర్థికంగా లాభాలున్నాయి. దీర్ఘకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. దీనికి కారణం పై అధికారులతో సత్సంబంధాలుండటమే. కొంతకాలం నుంచి వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం వెల్లివిరుస్తుంది. వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది.
కర్కాటక రాశి
అవివాహితులకు ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ సమస్యలను ఈ సమయంలో పరిష్కరించుకుంటారు. మానసికంగా ఎంతో ప్రశాంతత పొందడంతో జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలను వింటారు. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుక్రుడి నక్షత్ర సంచారం కర్కాటక రాశివారికి బాగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications