Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈనెలలో ప్రధానమైన గ్రహాలు రెండు రాశి సంచారం చేశాయి. దీనివల్ల వారికి విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఒక రాశిలో ఉన్న గ్రహాలు మరో రాశిలోకి సంచారం చేయడంవల్ల ప్రత్యేక ప్రభావం ఉంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. అలాగే ఆయా రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు రాకుమారుడైన బుధుడు మీన రాశిలోకి, శుక్రుడు మేషరాశిలోకి సంచారం జరిపాయి. ఈనెల 25వ తేదీన ఇది జరిగింది. దీని ప్రభావంవల్ల కొన్ని రాశులవారికి శుభ పరిణామాలు జరగనున్నాయి. ఇతర రాశుల్లోకి సంచారం చేయడంవల్ల వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
శక్తివంతమైన మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ ఈ రాశివారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వీరు భవనాలతోపాటు కొత్త కార్లను కొనుగోలు చేస్తారు. అనేక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వస్తుంది.
మిథున రాశి
వీరికి ధనలాభాలున్నాయి. ఆర్థికంగా పలు ప్రయోజనాలు అందనున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను తిరిగి పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. అలాగే కుటుంబ సభ్యలు మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
వృషభరాశి
పెండింగ్ లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది.












Click it and Unblock the Notifications