మీనరాశిలో నీచస్థితిలో బుధుడు... ఈ రాశులు పట్టిందల్లా బంగారమే

బుధుడు ప్రస్తుతం మీన రాశిలో, నీచ స్థితిలో, వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుంది. వచ్చేనెల 9 వరకు బుధుడు అక్కడే ఉంటాడు. వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వేతనాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్ వంటివి వృద్ధి చెందుతాయి. ఏయే రాశులవారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.

మేషం
వ్యాపారాలు, వృత్తులు వృద్ధి చెందుతాయి. ఖర్చులు తగ్గడంతోపాటు పొదుపు పాటిస్తారు. చర్చలు, ఒప్పందాలవంటి వాటిల్లో విజయాలు వరిస్తాయి. ఇంటర్వ్యూలు, పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ధన లాభం ఉంది.

these zodiac signs very lucky due to planet mercury in pisces

మిథునం
నష్టాలకంటే లాభాలే ఎక్కువ ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. పై అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి.

సింహం
వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్, కౌన్సెలింగ్, మార్కెటింగ్, రవాణా రంగాలవారు కుబేరులవుతారు. ధన లాభం ఉంది. ఏ పని తలపెట్టినా విజయం ఉంది. సంపన్న కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు ఉంటాయి.

కన్య
వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. స్త్రీ వల్ల లేదంటే మాతృమూర్తివల్ల ధనలాభం ఉంది. నిరుద్యోగులు వ్యాపారాల్లోకి ప్రవేశిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

ధనుస్సు
ఇల్లు లేదంటే వాహన సౌకర్యం అందుతుంది. ఆస్తి వివరాలు పరిష్కారమవుతాయి. ఆస్తులు కలిసివస్తాయి. వారసత్వ సంపద పెరుగుతుంది. లాటరీలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవనంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి.

మీనం
వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అంచనాలకు మించి లాభాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+