బృహస్పతి తిరోగమనంతో 2025 వరకు ఈ రాశులవారు ముకేష్ అంబానీలే అవుతారు
జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఎంతో ప్రధానమైన గ్రహం. సంపదకు కారకుడైన గురుడు అక్టోబరు తొమ్మిదో తేదీన వృషభరాశిలో తిరోగమనం చేస్తున్నాడు. 2025 వరకు ఇది కొనసాగుతుంది. అలాగే ఇదే సంవత్సరం గురుడు మిథునరాశిలో కూడా సంచారం చేస్తాడు. ఇది కూడా ఎంతో శుభప్రదమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల రాశిచక్ర జాతకులు డబ్బును పొందుతారని చెబుతున్నారు. ఈ సంచారాల వల్ల ఏ రాశులవారికి ఏ విధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
జీవితంలో శాంతి నెలకొని సంతోషంగా గడుస్తుంది. వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితంలో పలు మార్పులు వస్తాయి. కెరీర్ కు సంబంధించి చోటుచేసుకునే మార్పులవల్ల ఆర్థిక పరమైన విషయాల్లో మంచి నిర్ణయాలను తీసుకొని వాటిని సమర్థంగా అమలు చేస్తారు. డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. అడుగడుగునా అదృష్టం తోడుంటుంది.

కర్కాటక రాశి
ప్రతి రంగంలో సులువుగా విజయాలు సాధిస్తారు. విద్యార్థులు ఈ సమయంలో చేసే చిన్న ప్రయత్నం కూడా విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సభ్యులంతా తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. అనుకున్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
మిథున రాశి
పదో స్థానంలో గురుడు తిరోగమనం చేస్తుండటంతో వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా, ఏ పని తలపెట్టినా సులువుగా విజయం సాధిస్తారు. ఖర్చులు తగ్గిస్తారు. డబ్బుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని పొదుపు దిశగా అడుగులు వేస్తారు. కొత్త ఆదాయ వనరులు తలుపు తట్టడంతో ఆర్థికంగా స్థితిమంతులవుతారు. డబ్బుకు సంబంధించిన బ్యాలెన్స్ ను పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications