డొనాల్డ్ ట్రంప్ స్పీచ్ బాయ్ కాట్: లైసెన్సుల రద్దుకు దిగిన వైట్ హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. తన శత్రుదేశం చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఎన్నికల వ్యవస్థను పరోక్షంగా చైనా నియంత్రిస్తోందని విమర్రశించారు. విదేశీ శక్తుల జోక్యం, జాతీయ భద్రత, ఆర్థిక సంస్కరణలపై ఆయన చేసిన ప్రకటనలు అంతర్జాతీయ స్థాయిలో అగ్గి రాజేశాయి. దేశ ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న భారీ సైబర్ ముప్పును బహిర్గతం చేసేందుకు 2020 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఉన్న ఇంటెలిజెన్స్ నివేదికలను ప్రభుత్వం డీక్లాసిఫై చేసినట్లు ప్రకటించారు. వాటన్నింటినీ దేశ ప్రజల ముందు ఉంచినట్లు వెల్లడించారు.

దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమ దేశ ఎన్నికల వ్యవస్థను అంతర్గతంగా దెబ్బతీసేందుకు చైనా పెద్ద ఎత్తున ప్రయత్నించిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా చోరీ వెనుక చైనా హస్తం ఉందని స్పష్టం చేశారు. సుమారు 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరించిందని, దాని ద్వారా తమను శాసించే స్థాయికి ఎదుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Trump Seeks TV License Revocations for Major Networks Skipping His National Address From White house

ఈ ప్రసంగం అటు అమెరికాలోనూ నూతన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తన సుదీర్ఘ జాతీయ ప్రసంగాన్ని ప్రధాన ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. కొన్ని ప్రధాన న్యూస్ ఛానళ్లల్లో ట్రంప్ ప్రసంగం లైవ్ లో టెలికాస్ట్ కాలేదు. మీడియా హౌస్ ల పట్ల ఆయన అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వైట్ హౌస్, మీడియా మధ్య ఉన్న తీవ్ర విభేదాలు మరోసారి స్పష్టంగా బట్టబయలయ్యాయి.

ఏబీసీ, ఎన్‌బీసీ, సీఎన్ఎన్ వంటి దిగ్గజ మీడియా సంస్థలు ట్రంప్ ప్రసంగాన్ని టెలికాస్ట్ చేయలేదు. దీనికి బదులుగా తమ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మాత్రమే ఈ ప్రసంగాన్ని వీక్షకులకు అందుబాటులో ఉంచాయి. ఈ ప్రసంగ కవరేజ్ విషయంలో ఒక్కో టీవీ సంస్థ ఒక్కో వ్యూహాన్ని అనుసరించింది. ఏబీసీ న్యూస్ తన ప్రధాన టీవీ ఛానెల్‌లో అమెరికా అధ్యక్షుడి ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి బదులుగా ఏబీసీ న్యూస్ లైవ్, రేడియోలో మాత్రమే దీనిని అందించింది.

ఎన్‌బీసీ సైతం తన ఎన్‌బీసీ న్యూస్ నౌ స్ట్రీమింగ్ యాప్‌లోనే ట్రంప్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రత్యేక వార్తా విశ్లేషణను మాత్రం టీవీ ఛానెల్‌లో ఇస్తామని తెలిపింది. సీబీఎస్ కూడా తన ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారానే ప్రసంగాన్ని స్ట్రీమ్ చేసింది. సీఎన్‌ఎన్ ఈ ప్రసంగాన్ని ఓ సాధారణ కరెంట్ అఫైర్స్ గా మాత్రమే పరిగణించింది. వెబ్‌సైట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే ప్రసారం అయింది.

ఫాక్స్ నెట్‌వర్క్ మాత్రం ఈ ప్రసంగాన్ని ప్రారంభంలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసినప్పటికీ, కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే చూపించి ఆపేసింది. ఆ తర్వాత మిగిలిన ప్రసంగాన్ని తమ వెబ్‌సైట్‌లో చూడాల్సొచ్చింది వీక్షకులకు. దీనిపై ట్రంప్ స్పందించారు. తన ప్రసంగాన్ని కవర్ చేయని టీవీ ఛానళ్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ట్రంప్ ప్రసంగాన్ని లైవ్ ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఛానళ్లపై ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ అది సాధ్యం కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+