Russia Ukraine War: పోర్న్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం..

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్లకుపైగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. డ్రోన్ లు, క్షిపణులతో ఆ దేశంపై విరుచుకుపడుతూనే ఉంది. అయితే రష్యా యుద్ధాన్ని తట్టుకుని పోరాడేందుకు ఉక్రెయిన్ నిధులు సమకూర్చుకుంటోంది. నాలుగేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో ఇప్పటికే ఉక్రెయిన్ అధిక శాతం కోల్పోయింది. అయినా రష్యాపై పోరాడి గెలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిధులు సమకూర్చుకునేందుకు పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. పోర్నోగ్రఫీ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చట్టవిరుద్ధంగా ఉంది. పోర్న్ కంటెంట్ ను ఉత్పత్తి చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రసారం చేయడం చట్టరిత్యా నేరం. దోషులకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.

అయితే ఉక్రెయిన్ లో పోర్న్ బ్యాన్ అయినా అక్కడ ఈ పోర్న్ ఇండస్ట్రీ గణనీయంగా సీక్రెట్ గా అభివృద్ధి చెందుతున్నట్లు సమాచారం. లా ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో ఈ మేరకు భారీగా అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు అడల్ట్ కంటెంట్ క్రియేటర్స్ కొద్ది కాలంగా ఉక్రెయిన్ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. పన్నులు చెల్లించకపోతే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ పన్నులు చెల్లింపులు చేస్తే పోర్న్ కంటెంట్ ఉక్రెయిన్ లో బ్యాన్ కాబట్టి శిక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ లో పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్‌ చట్ట సభ్యుడు యారోస్లావ్‌ జెలెజ్ నియాక్ ప్రతిపాదించారు. అడల్ట్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ రంగాన్ని చట్టబద్ధం చేస్తే ఏటా సుమారు 25 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంతో డ్రోన్లు కొనుగోలు చేసి యుద్ధానికి వినియోగించాలని సూచనలు చేశారు. ఈ నగదుతో 30 వేల డ్రోన్ లను కొనుగోలు చేయొచ్చన్నారు.

యారోస్లావ్‌ ప్రతిపాదనను సపోర్ట్ చేసిన సభ్యులు మాట్లాడుతూ.. పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేయడం ద్వారా దేశంలో అదనంగా పన్ను వసూల్లు చేయవచ్చని.. అవినీతి తగ్గుముఖం పడుతుందని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ లో ఆన్ లైన్ అడల్ట్ కంటెంట్ విస్తృతంగా పెరుగుతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం.. పోర్నోగ్రఫీ ద్వారా ఒక్క 2023 లోనే 7,900 మంది ఉక్రెయిన్ దేశస్థులు 131 మిలియన్ డాలర్లకు పైగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక నాలుగేళ్లకుపైగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. యుద్ధం కోసం దేశీయంగా ఉత్పత్తి చేసిన డ్రోన్ లపైనే ఆ దేశం ఆధారపడుతోంది.

Ukraine promotes the porn industry to win the war against Russia considers legalizing pornography

అలాగే ఉక్రెయిన్‌ ‌కు క్షిపణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రష్యా ప్రయోగిస్తున్న అధునాతన, వేగవంతమైన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఏడాది జులైలో 1,500, ఆగస్టులో 2,500 డ్రోన్లకు పైగా ప్రయోగించడంతో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ డ్రోన్ ల కూల్చివేత శాతం క్రమక్రమంగా తగ్గిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోర్నోగ్రఫీని ఉక్రెయిన్ లో చట్టబద్ధం చేయాలన్న ప్రతిపాదన ఊపందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+