ఈ వారం ఓటీటీకి వస్తున్న కొత్త చిత్రాలు ఇవే
ఈ సెప్టెంబర్ రెండో వారంలో డిజిటల్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్ధమయ్యాయి. హారర్ కామెడీలు, రొమాంటిక్ థ్రిల్లర్లు, డ్రామా సిరీస్‌ల వరకు విభిన్న జానర్లలో స్ట్రీమింగ్‌కు వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్లాట్‌ఫామ్ వారీ వివరాలు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో
డ్రాన్ టుగెదర్ (రిలీజ్: సెప్టెంబర్ 9): ఓ శ్రీమంతుడైన వ్యాపారవేత్త కుమార్తె కిడ్నాప్‌కు గురై క్షేమంగా తిరిగొచ్చాక కథ మలుపు తిరుగుతుంది. ఆమెకు రక్షణగా నియమించిన బాడీగార్డ్‌కు, ఆమెకు మధ్య మొదట్లో తీవ్ర విభేదాలు ఏర్పడినా.. అనూహ్యంగా వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. డేంజర్, డ్రామా కలగలిపిన రోమాంటిక్ థ్రిల్లర్ ఇది.

నెట్‌ఫ్లిక్స్
నార్త్ ఆఫ్ నార్త్ - సీజన్ 2: (రిలీజ్: సెప్టెంబర్ 8): ఆర్కిటిక్ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణంలో నివసించే యువతి, విఫలమైన తన పెళ్లి బంధం నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పడే తపన, ఆమె ఎదుర్కొనే విచిత్రమైన సవాళ్ల సమాహారమే ఈ సిరీస్.
వై డిడ్ ఐ గెట్ మ్యారీడ్ అగైన్?: (రిలీజ్: సెప్టెంబర్ 9) ఇటలీలోని లేక్ కోమోలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ నేపథ్యంగా సాగే కథ. పాత స్నేహితులు, జంటలు కలిసిన వేళ, ఎదిగిన తమ పిల్లల ప్రేమ, పెళ్లి సమస్యలను చూసి తమ గత అనుభవాలను గుర్తుచేసుకునే భావోద్వేగ డ్రామా.
క్రూ గర్ల్: (రిలీజ్: సెప్టెంబర్ 10) పడవల పోటీ క్రీడలో రాణించాలనుకునే టీగన్ అనే అమ్మాయి జీవితం, కుటుంబంలో ఆర్థిక మోసం జరగడంతో ఒక్కసారిగా మారిపోతుంది. కొత్త స్కూల్‌లో గర్ల్స్ రోయింగ్ టీమ్ లేకపోయినా, తన కల కోసం ఆమె సాగించే పోరాటం నెట్‌ఫ్లిక్స్‌లో పలకరించనుంది.
కాల్ మై ఏజెంట్ ది మూవీ: (రిలీజ్: సెప్టెంబర్ 10) టాలెంట్ ఏజెంట్‌గా పనిచేసి, ఆ ప్రపంచాన్ని వదిలేసి దర్శకురాలిగా మారిన ఆండ్రియా మార్టెల్ తొలి సినిమా షూటింగ్ ప్రారంభంలోనే కథానాయకుడు తప్పుకుంటాడు. ప్రాజెక్ట్‌ను రక్షించుకోవడానికి ఆమె మళ్లీ తన పాత ఏజెన్సీ ప్రపంచంలోకి అడుగుపెట్టక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.
చుంబక్: (రిలీజ్: సెప్టెంబర్ 10) ఒకే హౌసింగ్ సొసైటీలోని ఐదు కుటుంబాల మధ్య సాగే లైట్-హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ. ప్రైవసీ లేని ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఒక చిన్న సంఘటన పెద్ద కుటుంబ నాటకానికి ఎలా దారితీస్తుందో నవ్వు తెప్పించేలా రూపొందించారు.
గో టీమ్!: (రిలీజ్: సెప్టెంబర్ 11) నష్టాల్లో ఉన్న ఒక చీజ్ పరిశ్రమ యాజమాన్యం ఉద్యోగుల ఆత్మవిశ్వాసం పెంచడానికి టీమ్ బిల్డింగ్ ట్రిప్ ఏర్పాటు చేస్తుంది. కానీ త్వరలోనే ఉద్యోగాల కోత ఉండబోతోందని తెలిసి ఆ ట్రిప్ కాస్తా ఉద్యోగుల మధ్య పోరుగా మారే కామెడీ డ్రామా.
స్టోలెన్ హార్ట్‌బీట్స్: (రిలీజ్: సెప్టెంబర్ 11) అవయవ మార్పిడి ముఠా చేతిలో భార్యను కోల్పోయిన ఓ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో.. భార్య గుండెను పొందిన మరొక మహిళ జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఊహించని విధంగా వారిద్దరూ ప్రేమలో పడ్డాక, వారి జీవితాలను ముడిపెట్టిన అసలు రహస్యం ఏమిటో తెలిసే క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్














Click it and Unblock the Notifications
