రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 - ఇంట్లోనే క్రిస్పీగా, స్పైసీగా ఇలా చెయ్యండి!

చాలామంది రెస్టారెంట్ లో తిన్న చికెన్ 65 రుచి ఇంట్లో రాదని అనుకుంటారు. కానీ సరైన కొలతలు, సరైన విధానంతో చేస్తే రెస్టారెంట్ స్టైల్ రుచి సులభంగా వస్తుంది. ఈ రెసిపీ ప్రకారం చేస్తే క్రిస్పీగా, కారంగా, రుచికరంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

బోన్‌లెస్ చికెన్ - అర కిలో
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - 3½ స్పూన్లు
పసుపు - ¾ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - 2 స్పూన్లు
మొక్కజొన్న పిండి - కొద్దిగా
మైదా - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - ½ స్పూన్
గుడ్డు - 1
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - వేయించేందుకు సరిపడా

Chicken 65 Recipe make the restaurant Style Chicken 65 Recipe - Crispy amp amp Spicy Homemade Version

తయారీ విధానం:

ముందుగా చికెన్‌ను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం కలపండి. బాగా కలిపిన తర్వాత మొక్కజొన్న పిండి, మైదా, గరం మసాలా, గిలకొట్టిన గుడ్డు సొన కలపండి. చికెన్ ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలియబెట్టి కనీసం 45 నిమిషాలు నాననివ్వండి. ఎక్కువసేపు నానబెడితే రుచి మరింత బాగుంటుంది.

మటన్ కారం పొడి.. ఇలా ట్రై చెయ్యండి.. అస్సలే వదిలిపెట్టరు!
మటన్ కారం పొడి.. ఇలా ట్రై చెయ్యండి.. అస్సలే వదిలిపెట్టరు!

ఇలా చేస్తే చికెన్ 65 టేస్ట్

ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి, మధ్యస్థ మంట మీద చికెన్ ముక్కలను వేయించండి. బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి సగానికి చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వండి. అవి వేగాక వేయించిన చికెన్ ముక్కలు వేసి ఒక నిమిషం కలపండి.సూపర్ టేస్ట్.

రొయ్యల కారం పొడి.. ఇలా చేస్తే రుచిలో తగ్గేదేలే!
రొయ్యల కారం పొడి.. ఇలా చేస్తే రుచిలో తగ్గేదేలే!

వేడివేడిగా సర్వ్ చేస్తే అదుర్స్

చివర్లో కొద్దిగా నిమ్మరసం వేసి స్టవ్ ఆపేయండి. వేడివేడిగా సర్వ్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్. అన్నం, రోటీ లేదా స్టార్టర్‌గా కూడా బాగా ఉంటుంది. ఈ విధానం ప్రకారం చేస్తే చికెన్ 65 బయటకు క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, స్పైసీగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+