"వెంటిలేటర్ పై పార్లమెంట్ ?"- 25 రోజులైనా ప్రోరోగ్ చేయరా ?
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. ఇది జరిగి 25 రోజులైంది. అయినా ఇప్పటికీ పార్లమెంట్ ను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఇదో అసాధారణ పరిస్ధితి. అయితే కేంద్రం ఇలా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినా ప్రోరోగ్ చేయకపోవడం (నిరవధికంగా వాయిదా వేయడం)తో ఇదంతా డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకునేందుకే అన్న చర్చ సాగుతోంది. త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ నిర్వహించి డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడంపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ఇవాళ మరోసారి కేంద్రానికి ఈ విషయాన్ని గుర్తుచేసింది. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసి నేటికి సరిగ్గా 25 రోజులు అయ్యింది. కానీ దానిని ఇంకా ప్రొరోగ్ చేయలేదంటూ కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ (Jairam ramesh) గుర్తుచేశారు. సాధారణంగా, నిరవధిక వాయిదా వేసిన 3-4 రోజుల తర్వాత ప్రొరోగేషన్ జరుగుతుందని, కానీ 2015 వర్షాకాల సమావేశాలకు ఈ వ్యవధి 28 రోజులు ఉందన్నారు. లలిత్ మోడీ వివాదం కారణంగా ఆ సమావేశాలు దాదాపు పూర్తిగా రద్దయ్యాయని గుర్తుచేశారు.

Today is exactly 25 days since Parliament was adjourned sine die. But it has still NOT been prorogued.
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 7, 2026
Normally prorogation takes place 3-4 days after adjournment sine die. But the gap for the Monsoon Session in 2015 was 28 days. That session had been washed out almost entirely… pic.twitter.com/PqwjWVhMeI
కానీ అప్పట్లో మోడీ ప్రభుత్వం జీఎస్టీ బిల్లులను బలవంతంగా ఆమోదింపజేయాలనే ఆశతో సమావేశాలను కొనసాగించిందన్నారు. దానికి రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం, కానీ అది వారికి లేదు. ఫలితంగా, మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలతో మరింత అర్థవంతంగా సంప్రదించి, చాలా ఆలస్యంగా బిల్లులను ఆమోదించవలసి వచ్చిందన్నారు. ఇప్పుడు మరోసారి డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి, హోం మంత్రి ఇప్పటికీ లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం నానా తంటాలు పడుతుండటంతో, 2026 వర్షాకాల సమావేశాలు వెంటిలేటర్‌పైకి వెళ్లాయని జైరాం రమేష్ ఆరోపించారు. తన బెదిరింపుల, భయపెట్టే రాజకీయాలు హద్దులు దాటాయనే వాస్తవాన్ని ఆయన అంగీకరించడానికి ఇంకెంత కాలం పడుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications
